Share News

Weekend Trip: ఖర్చు తక్కువ వినోదం ఎక్కువ.. ఎక్కడంటారా?.. ఈ వీకెండ్ మాములుగా ఉండొద్దు

ABN , Publish Date - Dec 08 , 2025 | 07:25 PM

వీకెండ్ టూర్ ప్లాన్ చేసే వారు లైఫ్‌లో ఒక్కసారి అయినా చూసి రావాల్సిన ప్రాంతం దాండేలి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ టౌన్ ప్రత్యేకతలు ఏమిటో, ఇక్కడకు వెళ్లేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Weekend Trip: ఖర్చు తక్కువ వినోదం ఎక్కువ.. ఎక్కడంటారా?.. ఈ వీకెండ్ మాములుగా ఉండొద్దు
Weekend Trip To Dandeli

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని మాత్రం భూలోక స్వర్గాన్ని తలపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాదిన ఉన్న దాండేలి టౌన్‌‌ సరిగ్గా ఇలాంటిదేనని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులకే కాకుండా సాహసికుల మనసును దోచే ఆకర్షణలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. మరి ఈ టౌన్ విశేషాలు, ఇక్కడ రెండు రోజుల టూర్‌కు ఎలాంటి ప్లాన్ వేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Dandeli Tourist Destination).

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఈ టౌన్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. స్వల్ప కాలిక ట్రిప్స్‌కు ఈ టౌన్‌‌ను మించిన పర్యాటక ప్రాంతం లేదు. కాళీ నది అందాలు, నదీ తీరం వెంబడి ఉన్న పచ్చని అడవులు, పచ్చదనం మధ్య ట్రెక్కింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడి విశేషాల జాబితాకు అంతే ఉండదు.

దాండేలికి వెళ్లాలనుకునే వారికి అక్కడ అనేక రిసార్టులు, హోమ్‌ స్టేలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు, పుణె, గోవా నుంచి పర్యాటకులు దాండేలికి పోటెత్తుతుంటారు. దీంతో, ఇక్కడ హోటల్స్ రిసార్టులను ముందస్తుగా బుక్ చేసుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.


రెండు రోజుల పర్యటన ప్లాన్ ఇలా..

శని, ఆదివారాల్లో ఇక్కడకు వచ్చే వారు ముందు రోజున కాళీ నదిలో పడవ జర్నీలు వంటివి ఎంజాయ్ చేయాలి. రాఫ్టింగ్, జార్బింగ్, వంటివి గొప్ప ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొందరు సంప్రదాయక కరాకల్ బోట్లలో ప్రయాణిస్తూ నదీ సౌందర్యాన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సహజసిద్ధమైన స్పా అనుభవాన్ని ఇచ్చే జకూజీ బాత్‌‌లో సేదతీరితే మనసు, శరీరంలోని అలసట అంతా చిటికెలో మటుమాయం అవుతుంది.

తొలి రోజు షాపింగ్ కూడా ట్రై చేయొచ్చని అక్కడి వారు చెబుతారు. షాపింగ్ ప్రియుల మనసుకు నచ్చేవి ఇక్కడ అనేకం ఉన్నాయి. గిరిజనులు రూపొందించిన పలురకాల బొమ్మలు, నగలు, పర్యావరణ హితమైన ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. స్థానికులు రూపొందించే చిత్రాలు కూడా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక రాత్రి వేళ చలి మంట వేసుకుని వినీలాకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు.


Dandeli 2.jpg

ఇక నదీ అందాలను ఎంజాయ్ చేసిన వారు రెండో రోజున ట్రెకింగ్‌కు వెళ్లడం ఉత్తమం. రెండు మూడు గంటల పాటు ప్రకృతి రమణీయత మధ్య నడక మనసును పూర్తి స్థాయిలో ఉత్తేజిం చేస్తుంది. సైక్లింగ్‌ను ఇష్టపడే వారికి పచ్చని చెట్ల మధ్య సైక్లింగ్ ట్రాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాటేజీలు, లగర్జీ హోటల్స్‌‌కు బదులు ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకునే వారికి నదీతీరం వెంబడి టెంట్స్‌లో వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వివిధ వర్గాల వారు తమ బడ్జెట్‌కు తగిన రీతిలో రెండు రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేసేందుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


రైలులో దండేలికి ఎలా వెళ్లాలి..

రైలు ద్వారా దండేలి చేరుకోచ్చు. దండేలిలో రైల్వే స్టేషన్ లేదు.. కానీ సమీప రైల్వే స్టేషన్ అల్నావర్ జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా దండేలికి వెళ్లవచ్చు. అల్నావర్‌ రైల్వే జంక్షన్‌ నుంచి దాదాపు 32 కిలోమీటర్ల ఉంటుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి మనం అల్నావర్ జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు, ప్రభుత్వ వాహనాల్లో అక్కడికి చేరుకోవచ్చు.

బస్సులో కూడా..

హుబ్లి నుంచి దండేలికి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేట్ బస్సు సర్వీసును అక్కడికి చేరుకోవచ్చు.

కారులో దండేలి చేరుకోవడం..

కారులో దండేలికి డ్రైవింగ్ చేయడం అద్భుతమైన అనుభవంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి మీరు దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ.. దండేలి ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. దండేలి చేరుకోవడానికి హైదరాబాద్‌ నుంచి NH44, NH63 వయా హుబ్లి చేరుకోవచ్చు. ( NH44 → NH48 → SH 34 వయా చిత్రదుర్గ, హుబ్లి, కల్ఘట్గి, హలియాల్) మీదుగా NH48 మార్గంలో మన ఈ ప్రయాణం దాదాపు 8-9 గంటలు పడుతుంది.


Also Read:

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..

ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూశారా

For More Lifestyle News

Updated Date - Dec 09 , 2025 | 11:53 AM