Share News

Snakes: వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:54 PM

వానాకాలంలో పాములు ఇంట్లోకి చొరబడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Snakes: వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..
snake prevention tips

ఇంటర్నెట్ డెస్క్: వానాకాలం మొదలైంది. ఇక పాముల బెడద కూడా ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో ఉన్న వారికి పాములతో రిస్క్ మరింత ఎక్కువ. విషపూరిత పాముల బారిన పడితే ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. దేశంలో ఏటా వేలాది పాము కాటు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో అధిక శాతం నివారించదగ్గవే అని నిపుణులు చెబుతున్నారు.

వానాకాలంలో పాములు ఇళ్లల్లోకి దూరే ముప్పు ఎక్కువ. పాములు దాక్కునే చోట్లలో వాన నీరు చేరి అవి బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పొడిగా వెచ్చగా ఉన్న ప్రాంతాల కోసం వెతుకుతూ ఇళ్లల్లోకి చేరతాయని హెచ్చరిస్తున్నారు. పాములు ఇళ్లల్లోకి దూరకుండా ఉండాలంటే ముందుగా గడపల కింద, గోడలు, కిటికీల్లో రంధ్రాలు ఏమైనా ఉంటే వెంటనే పూడ్చేయాలి. తలుపులకు వైర్ మెష్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి.


ఇంటి చుట్టు దట్టమైన మొక్కలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు. ఇంటి చుట్టు పేరుకునే చెత్తాచెదారం, ఆకులు వంటి వాటి మధ్య పాములు దాక్కుంటాయని చెబుతున్నారు. ఇంటి చుట్టు చెక్కలు వంటివేవీ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే పాములతో రిస్క్ అంత తగ్గుతుంది. వైట్ ఫినైల్, లేదా ఉప్పుకు వెల్లులి జత చేసి పాములు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల పెడితే అవి రావని కూడా చెబుతున్నారు. రాత్రి పూట పాములు క్రియాశీలకంగా మారతాయి. కాబట్టి ఇళ్లల్లో రాత్రి సమయాల్లో కొంత వెలుగురు ఉండేలా కొన్ని లైట్లు వేసి ఉంచాలి.


ఇక పాము కాటు బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తకాళ్లతో చీకటిగా ఉన్న ప్రాంతాల్లో సంచరించొద్దు. బూట్లు, దుస్తులు, బ్యాగుల్లో కూడా పాములు దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగా వాటిని బాగా దులిపాకే వినియోగించాలి. ఒక వేళ ఇంట్లోకి పాము చొరబడితే కంగారు పడకుండా పాములు పట్టే వారికి సమాచారం ఇవ్వాలి. మీరు ఉంటున్న ప్రాంతంలో సాధారణంగా కనిపించే విషపూరిత పాముల గురించి కూడా తెలిసుండాలి. పాములపై దాడి చేసేందుకు అస్సలు ప్రయత్నించొద్దు.

ఇవి కూడా చదవండి:

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 04:10 PM