Money Saving Tips: ఈ టిప్స్‌తో మీ ఖర్చులు తగ్గించి, ఎక్కువ ఆదా చేయండి!
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:44 PM
డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది తమ డబ్బును వృధా చేసుకుంటారు. దీనివల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబ్బు వృధా కాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ డబ్బును భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవాలని అనుకుంటారు. కానీ, కొన్ని తప్పుల వల్ల సంపాదించిన డబ్బు వృధా అవుతుంది. ముఖ్యంగా కొంతమంది బ్రాండెడ్ వస్తువులను కొనడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అనవసరంగా ఖర్చు చేసే అలవాటు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది. డబ్బు వృధా కాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అవసరం, కోరిక మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి
నిత్యావసర వస్తువులకు మాత్రమే ఖర్చు చేయండి. మీ కోరికల కోసం ఎక్కువ ఖర్చు చేయకండి. ఉదాహరణకు, మీ పాత ఫోన్ పాడైపోయిందని కొత్త మొబైల్ ఫోన్ కొనడానికి, మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ కొత్త వెర్షన్ కొనడానికి మధ్య చాలా తేడా ఉంది. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం వల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ఏదైనా కొనడానికి ముందు రెండుసార్లు ఆలోచించండి. నిత్యావసర వస్తువులకు మాత్రమే ఖర్చు చేయండి. ఈ విధంగా మీరు డబ్బు వృధా కాకుండా నివారించవచ్చు.
బడ్జెట్ ప్లాన్ చేయండి:
మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను నోట్ చేసుకోండి. బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి. మీ ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయో చూడండి. వచ్చే నెలలో వాటిని తగ్గించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల అనవసరమైన వస్తువులను కొనకుండా ఉండటానికి, ఖర్చులను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.
తొందరపడి షాపింగ్ చేయకండి:
కొంత మంది తమ సరదా కోసం షాపింగ్ వెళ్లే వాళ్లు ఉంటారు. వారు తమ చేతికి దొరికినవన్నీ కొంటారు. కానీ, ఇలా చేయడం మంచిది కాదు. అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి. ఎంత డబ్బు అవసరమో అంత డబ్బును మాత్రమే తమతో తీసుకెళ్లండి. అప్పుడే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మనకు తెలుస్తుంది.
పొదుపు అలవాటు చేసుకోండి:
డబ్బు వృధా చేయకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీరు ప్రతి నెలా మీ ఆదాయంలో కనీసం 10 నుండి 20 శాతం పొదుపు చేయండి లేదా ఎందులోనైనా పెట్టుబడి పెట్టండి. ఈ అలవాటు భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది.
క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడండి:
చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని నియంత్రణ లేకుండా ఉపయోగిస్తే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించండి. దీనివల్ల డబ్బు వృధా కాకుండా ఉంటుంది.
Also Read:
తిన్న తర్వాత కడుపు నొప్పి, ఉబ్బరం అనిపిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి.!
హర్మోన్ ఇంబ్యాలెన్స్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!
For More Latest News