Money Saving Tips: 210 రూపాయలతో 5000 హామీ.! ఈ ప్రభుత్వ స్కీం గురించి మీకు తెలుసా?
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:33 PM
ఈ స్కీంలో కేవలం నెలకు రూ. 210 పెట్టుబడి పెడితే చాలు.. వృద్ధాప్యంలో మీకు రూ. 5000 పెన్షన్ లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకం సురక్షితమైన పదవీ విరమణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇంటర్నెట్ డెస్క్: వృద్ధాప్యంలో నెల నెలా క్రమంగా ఆదాయం రావాలని అనుకునే వారి కోసం అటల్ పెన్షన్ స్కీమ్ (Atal Pension Yojana) ఒక మంచి అవకాశంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా మీరు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా రూ. 1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.
చిన్న పెట్టుబడి – పెద్ద భద్రత
మీరు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సులో ఉంటే ఈ పథకంలో చేరవచ్చు. ఉదాహరణకు, మీరు 18 ఏళ్ల వయసులో నెలకు రూ.210 చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత మీరు నెలకు రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. అయితే, కనీసం 20 ఏళ్ల పాటు నెలకు రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది.
అర్హతలు
భారతీయ పౌరుడై ఉండాలి
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి
ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా (KYC) ఉండాలి
ఎలా దరఖాస్తు చేయాలి?
మీ సమీప బ్యాంక్‌కు వెళ్లండి
అటల్ పెన్షన్ యోజన ఫారమ్ తీసుకొని ఫిల్ చేయండి
ఆధార్, బ్యాంక్ వివరాలు, వయస్సు వంటి సమాచారాన్ని ఇవ్వండి
మీకు కావలసిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోండి (1,000 నుంచి 5,000 వరకు)
బ్యాంక్ దరఖాస్తు ధృవీకరిస్తే, మీ ఖాతా పథకానికి లింక్ అవుతుంది.
ఇతర ప్రయోజనాలు
మీరు మరణించిన తరువాత మీ జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది
ఇద్దరూ లేనిపక్షంలో మొత్తం డబ్బు నామినీకి అందుతుంది
ఈ పథకం ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగినవారికి బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌కు ఆర్థిక భద్రత ఏర్పరచుకోవడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
స్టీల్ పాత్రలలో ఉప్పు నిల్వ చేస్తున్నారా? జాగ్రత్త.!
శ్రీలంక సువర్ణావకాశం.. వీసా లేకుండానే 40 దేశాలకు విహరించే ఛాన్స్.!
For More Lifestyle News