Humid Smell In Car: వానాకాలంలో కారులో దుర్వాస పోవాలంటే ఈ టిప్స్‌ను పాటించాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 08:41 PM
వానా కాలంలో కారులో తేమ చేరి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ బెడద లేకుండా ఉండాలంటే పాటించాల్సి టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వానాకాలంలో కార్లలో దుర్వాసన సహజం. గాల్లో తేమ కారణంగా మసక బారిన అద్దాలు, తడిగా అనిపించే సీట్లు చాలా మందికి చికాకు తెప్పిస్తాయి. అయితే కారులోపలి గాల్లో తేమను తొలగించి దుర్వాసనను లేకుండా చేసే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
కారులోపలి గాల్లో తేమ ఎక్కువగా ఉంటే అద్దాలు మసకగా మారతాయి. అంతేకాకుండా కారు లోపలి భాగంలో ఫంగస్ పెరుగుదలకు దారి తీస్తాయి. దీంతో, దుర్వాసన మొదలవుతుంది. వానా కాలంలో ఈ సమస్య మరింత అధికం. అయితే, ఈ సమస్యకు కొన్ని సులువైన పరిష్కారాలు కూడా ఉన్నాయి.
మసకగా మారిన అద్దాలు మళ్లీ పొడిగా మారేందుకు కారులోని డీఫాగర్‌ను వినియోగించాలి. ఇదే సమయంలో ఏసీ కూడా ఆన్ చేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. దీంతో, అద్దాలపై ఉన్న తేమ మొత్తం పోయి శుభ్రంగా మారతాయి.
కారులో సిలికా జెల్ ప్యాకెట్స్‌ను పెట్టినా తేమతో ఇబ్బంది తొలగిపోతుంది. కొన్ని సిలికా బ్యాగ్స్ కానీ ప్రత్యేకమైన డీహ్యూమిడిఫయ్యర్ బ్యాగ్ కానీ పెడితే లోపలి గాల్లోని తేమనంతా అవి పీల్చుకుంటాయి. దీంతో, లోపలంతా పొడిగా మారుతుంది. ఎలాంటి దుర్వాసనలు రావు.
బయట ఎండగా ఉన్న సమయంలో కారు అద్దాలను తెరిచి ఉంచితే కూడా ప్రయోజనం ఉంటుంది. దీంతో, తాజా గాలి కారులోపలికి వచ్చి తేమనంతా బయటకు నెట్టేస్తుంది. ఈకాలంలో కార్లను కొంత సేపు ఎండలో నిలిపి ఉంచమని కూడా కొందరు చెబుతుంటారు.
తడిసిన దుస్తులు, చెప్పులు, గొడుగుల వంటి వాటితో కారులో కూర్చొంటే లోపలి వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఇక కారులో తడిగా ఉన్న ఫ్లోర్ మ్యాట్స్‌ను కాసేపు బయట బాగా విదిలించాలి. దుస్తులు, షూస్ విషయంలో కూడా ఈ నియమం పాటించాలి.
కారులోని దుమ్ము మొత్తం తొలగిపోయేలా వ్యాక్యూమ్ క్లీనర్ వినియోగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. బాగా వానపడుతున్న రోజుల్లో కారు అద్దాలు డ్యాష్ బోర్డు వంటి వాటిని పొడిగా ఉన్న మైక్రో ఫైబర్ క్లాత్‌తో తుడిస్తే కూడా తేమ బెడద తగ్గుతుంది. ఈ సింపుల్ టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే వానా కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని అనుభవజ్ఞులు భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కొబ్బరి నూనే నా చర్మ సౌందర్య రహస్యం: నటుడు మాధవన్
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్