Share News

Tamannaah Fitness Coach: తమన్నా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. ఫిట్‌నెస్ కోచ్ ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:33 PM

చాలా మంది ఫిట్‌నెస్ గోల్ పెట్టుకుని చాలా కష్టపడుతూ ఉంటారు. గంటలు గంటలు జిమ్‌లో శ్రమిస్తూ ఉంటారు. అయితే, డైట్ విషయంలో వారు చేసే పొరపాటు మొత్తం శ్రమను వృధా చేస్తుంది.

Tamannaah Fitness Coach: తమన్నా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. ఫిట్‌నెస్ కోచ్ ఏం చెప్పాడంటే..
Tamannaah Fitness Coach

భారతీయ భోజనం అంటే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అధిక శాతంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల బరవు పెరిగే అవకాశం ఉంది. అందుకే సెలెబ్రిటీలు జిమ్‌లో వర్కవుట్లు చేయటంతో పాటు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. బరువును అదుపులో ఉంచుకుంటారు. సెలెబ్రిటీలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో చాలా మందికి తెలీదు. తమన్నా భాటియా, కంగనా రనౌత్‌లకు ఫిట్‌నెస్ కోచ్‌గా పని చేసిన ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ సెలెబ్రిటీ మీల్ సీక్రెట్ బయటపెట్టారు. ఫిట్‌గా ఉండటానికి భారతీయ ఆహారాన్ని ఎలా తీసుకోవాలో చెప్పారు.


ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. పెద్ద మొత్తంలో కూరలు, చపాతీలు తినకూడదని చెప్పారు. ఫిట్‌గా ఉండాలంటే డైట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ..‘రెండు చపాతీలు, సగం కప్పు కర్రీ తీసుకోవాలి. సగానికి సగం కార్బోహైడ్రేట్స్ కట్ చేశాము కాబట్టి.. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సలాడ్‌ మీల్‌లో చేర్చుకోవాలి. శరీరానికి పెద్ద మొత్తంలో ఫైబర్ అందుతుంది. మరి ప్రొటీన్ కోసం గ్రీక్ యోగార్ట్ తీసుకోవచ్చు. అందులో20 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. లేదంటే యోగార్ట్ స్థానంలో పనీర్ తీసుకోవచ్చు’ అని తెలిపారు.


సిద్ధార్థ్ చెబుతున్న దాని ప్రకారం ఒక చిన్న మార్పుతో ఫిట్‌నెస్ మన సొంతం అవుతుంది. చాలా మంది ఫిట్‌నెస్ గోల్ పెట్టుకుని చాలా కష్టపడుతూ ఉంటారు. గంటలు గంటలు జిమ్‌లో శ్రమిస్తూ ఉంటారు. అయితే, డైట్ విషయంలో వారు చేసే పొరపాటు మొత్తం శ్రమను వృధా చేస్తుంది. రైస్, చపాతీలు కర్రీలతో కలిపి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ పెద్ద మొత్తంలో శరీరంలోకి చేరతాయి. ఒక గ్రాము కార్బోహైడ్రేట్స్‌లో 4 క్యాలరీలు ఉంటాయి. మనం ఎన్ని ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు అంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. కస్టడీ పొడిగించాలని పోలీసుల పిటిషన్

గైక్వాడ్, కోహ్లీ సెంచరీలు.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..

Updated Date - Dec 03 , 2025 | 05:40 PM