Chanakyaniti : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. జాగ్రత్త.. మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు..!
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:00 PM
ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు. అయితే, చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారిని ఎవరు ఇష్టపడరట. కాబట్టి, ఇలాంటి వాళ్ళు తమ లక్షణాలని మార్చుకోవడం మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు.

Chanakyaniti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు. చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారు ఎవ్వరికీ నచ్చరట. కాబట్టి, ఇలాంటి వారు తమ లక్షణాలని మార్చుకోవడం మంచిదని చాణక్యుడు చెబుతున్నారు. అయితే, ఎలాంటి వారిని ఎవ్వరూ ఇష్టపడరో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వార్థం
చాణక్య నీతి ప్రకారం స్వార్థం కలిగిన వారిని ఎవ్వరూ ఇష్టపడరు. తన గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచించే వారిని సమాజమే కాకుండా తన కుటుంబం కూడా దూరం పెడుతుంది. అలాగే, ఇతరులకి హాని కలిగించే వ్యక్తులను కూడా ఎవ్వరూ ఇష్టపడరని చాణక్యుడు చెబుతున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి, మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని మార్చుకోవడం మంచిది.
అబద్ధాలు
అలాగే అబద్ధాలు చెప్పే వారిని కూడా ఎవ్వరూ ఇష్టపడరని చాణక్య నీతి చెబుతోంది. అబద్ధాలు చెప్పే వారిని ఎవరు నమ్మరు. అందుకే, వీరిని మాత్రమే కాకుండా వీరి కుటుంబాన్ని కూడా అందరూ దూరం పెడతారని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. అలాగే, సోమరిగా ఉండే వారిని కుటుంబ సభ్యులు కూడా దూరం పెడతారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా భారం అవుతారు.
నెగిటివ్‌గా ఆలోచించేవారిని..
అలాగే ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించే వారిని సమాజం దూరం పెడుతుంది. చేసే మంచి పనుల్లో కూడా నెగిటివ్‌గా ఆలోచించే వారు కొందరు ఉంటారు. అయితే, ఇలాంటి వారితో కలిసి ఉండటం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి, ఇలాంటి వారు వారి స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. లేదంటే సమాజంలోనే కాకుండా కుటుంబంలో కూడా మీకు సరైనా విలువ ఉండదు.
Also Read:
ఆడవాళ్ల గురించి మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేని 4 విషయాలు ఇవే..
బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..
For More Lifestyle News