Share News

Chanakya Niti: పెళ్లైన పురుషులు.. ఇతర మహిళల పట్ల ఎందుకు అట్రాక్ట్ అవుతారో తెలుసా..

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:45 PM

పెళ్లైన పురుషులు ఇతర మహిళల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారో తెలుసా? దీని వెనుక కారణాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇందుకు సంబంధించిన పలు కారణాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti:  పెళ్లైన పురుషులు.. ఇతర మహిళల పట్ల ఎందుకు అట్రాక్ట్ అవుతారో తెలుసా..
Chanakya

Chanakya Niti: పెళ్లయ్యాక కూడా కొంతమంది పురుషులు ఇతర మహిళల పట్ల అట్రాక్ట్ అవుతుంటారు. ఇది భార్యలకు చాలా బాధ కలిగించే విషయం. అయితే, భర్తలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా? దీని వెనుక కారణాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇందుకు సంబంధించిన పలు కారణాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చిన్న వయసులోనే పెళ్లి కావడం

కొంత మంది పురుషులు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. అయితే, ఈ వయసులో వాళ్లు కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెడతారు. కాలక్రమేణా జీవితం స్థిరంగా మారినప్పుడు అతను తన కోరికలపై శ్రద్ధ చూపుతాడు. ఇది ఇతరులపై ఆకర్షణకు దారితీస్తుందని చాణక్య నీతి చెబుతోంది.

శారీరక సంబంధాల్లో అసంతృప్తి

భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం సంతృప్తికరంగా లేకపోతే సంబంధం బలహీనమవుతుందని చాణక్యుడు అంటున్నారు. దీనివల్ల భర్త ఇతర మహిళల పట్ల మొగ్గు చూపవచ్చు.


పిల్లలు పుట్టిన తర్వాత దూరం

కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత, భార్య తన సమయాన్ని ఎక్కువగా పిల్లలకే కేటాయిస్తుంది. దీంతో భర్త ఒంటరిగా ఫీలవ్వచ్చు. ఇలాంటి సందర్భాలలో పురుషులు ఇతర స్త్రీల వైపు ఆకర్షితులవుతారని చాణక్య నీతి చెబుతోంది.

వివాహేతర సంబంధాలు – ప్రమాదకరం

వివాహేతర సంబంధాలు కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇది నమ్మకాన్ని నాశనం చేస్తుంది. కొంతమందికి ఇది చిన్న విషయం అనిపించినా, దీని ప్రభావం భార్యాభర్తల సంబంధంపై తీవ్రంగా ఉంటుంది.

స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజమే. కానీ అది సంబంధాన్ని నాశనం చేసే దిశగా వెళ్లకూడదు. చాణక్యుని మాటల ప్రకారం, ఆకర్షణ ఉండొచ్చు కానీ మన శ్రద్ధ, బాధ్యత కుటుంబంపైనే ఉండాలి. సంబంధం నిలబడాలంటే నిజాయితీ, పరస్పర గౌరవం, ప్రేమ అతి ముఖ్యమైనవి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

కందిరీగ కుట్టిన వెంటనే ఇలా చేయండి..

షాంపూ అవసరం లేదు.. ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు

For More Lifestyle News

Updated Date - Jun 17 , 2025 | 06:04 PM