Chanakya Niti On Marriage life: వివాహం తర్వాత ఈ 4 తప్పులు చేయకండి.. జీవితం నరకంగా మారుతుంది..
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:02 PM
వివాహిత పురుషులకు చాణక్య నీతి నాలుగు ముఖ్యమైన హెచ్చరికలు ఇస్తుంది. పురుషులు వాటిని పాటిస్తే తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాణక్య నీతి: వివాహిత పురుషులు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. వివాహం ఒక పవిత్రమైన బంధమని, అందులో భాగస్వాములిద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. సంబంధాలలో చీలికలు సృష్టించే కొన్ని సాధారణ తప్పులను నివారించాలని ఆయన ముఖ్యంగా వివాహిత పురుషులను హెచ్చరించారు. వివాహం తర్వాత ఈ 4 తప్పులు చేస్తే జీవితం నరకంగా మారుతుందని తెలిపాడు. ఎట్టిపరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకూడదని సూచించాడు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరొక స్త్రీ పట్ల ఆకర్షణ
చాణక్యుడు చెప్పిన మొదటి అతి ముఖ్యమైన విషయం లైంగికతపై నియంత్రణ. వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షణ కలిగి ఉండటం లేదా ఆమె గురించి ఆలోచించడం కూడా వైవాహిక జీవితానికి వినాశకరమైనది.
భార్యను ఒక వస్తువుగా చూడటం
చాణక్యుడి ప్రకారం, పురుషులు చేయకూడని రెండవ తప్పు ఏమిటంటే, వారి భార్యను ఒక వస్తువుగా భావించడం. చాణక్యుడి ప్రకారం, భార్య ఒక వస్తువు కాదు, ఆమెకు స్వంత నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ఉంటుంది. భర్త తనకు స్వేచ్ఛాను ఇవ్వాలి.
అత్తమామల పట్ల గౌరవం
చాణక్యుడు ఇచ్చిన మూడవ సలహా ఏమిటంటే, పురుషులు వారి అత్తమామల పట్ల కూడా గౌరవం కలిగి ఉండాలి. మీరు మీ తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తారో, మీ భార్య తల్లిదండ్రులతో కూడా అలాగే ప్రవర్తించాలి.
నిజాయితీ
చాణక్యుడు చెప్పిన చివరి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజాయితీ. కొంతమంది పురుషులు వివాహం తర్వాత కూడా తమ భార్యను మోసం చేస్తుంటారు. అయితే, పురుషుడు ఇలా ఉంటే భార్యకు భర్తపై నమ్మకం పోతుంది.
Also Read:
Turkey Pakistan Weapons: పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలు పంపిందా లేదా..ప్రభుత్వం క్లారిటీ
Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు
Chennai: పాక్ జలసంధి వద్ద తీరానికి కొట్టుకొస్తున్న జెల్లీ చేపలు.. వాటిని తాకితే..