Chanakya Niti: స్త్రీలో ఈ లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం..
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:28 PM
ఆచార్య చాణక్యుడు కుటుంబ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ముఖ్యంగా స్త్రీ లక్షణాల గురించి వివరించారు.

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఆదర్శంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితం గురించి ఆయన అనేక విషయాలను తన చాణక్య నీతిలో ప్రస్తావించారు. ముఖ్యంగా స్త్రీ లక్షణాల గురించి చక్కగా వివరించారు. కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా అది స్త్రీ లక్షణాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. స్త్రీలోని ఈ లక్షణాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు అంటున్నారు.
అవసరానికి మించి ఖర్చు చేయడం
అవసరానికి మించి ఖర్చు చేస్తే ఆ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి చెందదని చాణక్యుడు అంటున్నారు. బట్టలు, మేకప్ మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తే ఎంత సంపాదించినా ఆ డబ్బు సరిపోదని, ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగదని చెబుతున్నారు. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడక తప్పదన్నారు.
చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం
చిన్న చిన్న విషయాలకే కోపం పడే అలవాటు ఉన్న స్త్రీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అంతేకాకుండా, ఇలా రోజూ గొడవలు జరిగే ఇంట్లో డబ్బు, శ్రేయస్సు ఉండవని చాణక్యుడు చెబుతున్నారు.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం
ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, పక్కింటి వాళ్ల గురించి విమర్శలు చేయడం, కుటుంబ విషయాలను బయటపెట్టడం మంచి లక్షణం కాదు. ఇలా చెప్పడం వల్ల ఇంటి గౌరవం నాశనం అవుతుంది. ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో లేకపోవడమే మంచిదని చాణక్యుడు అంటున్నారు.
డబ్బు లేదా అందం గురించి గర్వపడటం
తన అందం, ధనం గురించి గర్వపడే స్త్రీకి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. గర్వం ఉన్న చోట ప్రేమ ఉండదు. అలా గర్వంతో జీవించే స్త్రీ చివరకు ఒంటరిగా మిగిలిపోతుందని చాణక్యుడు చెప్పాడు.
భర్త ఆదాయాన్ని తక్కువగా చూడటం
భర్త సంపాదన తక్కువగా ఉందని మాటలతో హేళన చేయడం, ఇతరులతో పోల్చడం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే భర్త మనసు గాయపడుతుంది. ఇది ఆ కుటుంబానికి మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తుంది.
Also Read:
పీరియడ్స్ సమయంలో మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
కూకట్‌పల్లి డ్రగ్స్ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు
For More Lifestyle News