Happy In Life: ఈ ఆరు అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి.. తప్పక పాటించండి..
ABN , Publish Date - Apr 26 , 2025 | 08:42 PM
6 Habits: మీరు గనుక మీ జీవితం సంతోషంగా సాగాలి అనుకుంటే .. ఓ ఆరు అలవాట్లను తప్పకుండా పాటించాలి. మంచి అలవాట్లకు దగ్గరగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మనకు ఎంతో సింపుల్‌గా అనిపించే అలవాట్ల కారణంగా మన భవిష్యత్తు మొత్తం నాశనం కావచ్చు.

మన అలవాట్లే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మనకు ఎంతో సింపుల్‌గా అనిపించే అలవాట్ల కారణంగా మన భవిష్యత్తు మొత్తం నాశనం కావచ్చు. లేదా అర్థాంతరంగా జీవితమే ముగిసిపోవచ్చు. అలవాట్లకు అంత పవర్ ఉంది. అందుకే మంచి అలవాట్లకు దగ్గరగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు గనుక మీ జీవితం సంతోషంగా సాగాలి అనుకుంటే .. ఓ ఆరు అలవాట్లను తప్పకుండా పాటించాలి. ఆ ఆరు అలవాట్ల కారణంగా జీవితం మారటమే కాదు.. సంతోషానికి కొదువలేకుండా ఉంటుంది. మన జీవితాన్ని మార్చే ఆ ఆరు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కృతజ్ణతా భావం
నూటికి 90 శాతం మంది తమ దగ్గర ఉన్నవాటి కంటే.. లేని వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. మనకు ఉన్న దాంట్లో తృప్తి పడటం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మనకున్న వాటిపై కృతజ్ణతా భావం కలిగి ఉండటం అన్నది చాలా మంచిది. కృతజ్ణతా భావం వల్ల జీవితం పట్ల మన ఆలోచనా విధానం మారుతుంది.
వ్యాయామం
మనసు కంట్రోల్‌లో ఉండాలంటే.. మన శరీరం ఫిట్‌గా ఉండాలి. సగం మానసిక రోగాలకు శరీరం ఫిట్‌గా ఉండటమే పరిష్కారం. బలహీనమైన శరీరం.. బలమైన నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై... ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉండటానికి వీలవుతుంది.
ప్రకృతితో గడపాలి
ప్రకృతి కారణంగా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. రోజులో కొన్ని నిమిషాలైనా ప్రకృతితో గడపాలి. ఎండలో తిరగాలి. ఇలా చేయటం వల్ల మన మూడులో మార్పు వస్తుంది. మెంటల్ క్లారిటీ కూడా వస్తుంది.
సెల్ ఫోన్ వాడకం
సెల్ ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. జీవితం అంత సంతోషంగా ఉంటుంది. గంటల పాటు మొబైల్ వాడటం అన్ని రకాలుగా నష్టం కలిగిస్తుంది. అందుకే మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. ఇలా చేయటం వల్ల అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.
నిద్ర
మన జీవితంలో ప్రధానమైన స్థాయి నిద్రకు మాత్రమే ఉంటుంది. చాలా మంది ఈ నిద్రనే పట్టించుకోరు. మంచి నిద్ర కారణంగా మన శరీరం ఉరకలేస్తుంది. మామూలు కంటే ఎక్కువ చురుగ్గా పని చేస్తుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం.
ఇష్టమైన వాళ్లతో గడపటం
చివరిది .. అతి ముఖ్యమైనది. మనకు ఇష్టమైన వాళ్లతో సమయాన్ని గడపాలి. అది తల్లిదండ్రులు కావచ్చు.. భార్యాభర్తలు కావచ్చు.. స్నేహితులు కావచ్చు. మన మనసుకు హాయినిచ్చే వారితో కొంత సమయాన్ని గడపటం వల్ల మన మూడ్ మారుతుంది. ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
Viral Video: తల్లీ నీ ధైర్యానికి సెల్యూట్.. చెట్టు మీద ఆ డ్యాన్స్ అదుర్స్ కానీ..
Shubman Gill: ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా.. గిల్ నుంచి ఊహించని ఆన్సర్