Share News

Deadliest Strike: దారుణమైన దాడి, 74 మంది మృతి, 170 మందికి పైగా గాయాలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 09:29 PM

అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా తిరగకుండా ఏ ఉగ్రవాద సంస్థా అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే చెబుతూ ముందుకు సాగుతుంటే..

Deadliest Strike: దారుణమైన దాడి, 74 మంది మృతి, 170 మందికి పైగా గాయాలు
US launches deadliest strike

US Launches Deadliest Strike: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై అగ్రరాజ్యం అమెరికా మరో దాడికి దిగింది. నెల రోజుల వ్యవధిలోనే ఇది మరో అతి పెద్ద దాడి. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని శుక్రవారం అమెరికా వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 74 మంది మరణించగా, 170 మందికి పైగా గాయపడ్డారని తాజా మీడియా నివేదికలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో ఇది అత్యంత దారుణమైన దాడి అని అంటున్నారు. అమెరికా సైన్యం యొక్క సెంట్రల్ కమాండ్ ఈ దాడికి సంబంధించి ప్రాణ నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు, హౌతీల నియంత్రణ మధ్య యెమెన్ నుండి కూడా దాడికి సంబంధించిన పూర్తి సమాచారం పొందడం ఒకింత కష్టం గానే ఉంది.

అయితే, రాత్రి వేళ రాస్ ఇసా చమురు ఓడరేవుపై జరిగిన ఈ దాడి, ఆకాశంలోకి భారీ అగ్నిగోళాలు ఒక్కసారిగా పేలేయా అనే భీతిని కలిగించాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడి అమెరిక ఆక్రోశానికి ప్రతీకగా నిలిచిందని చెబుతున్నారు. కాగా, ఈ దాడికి సంబంధించి అమెరికా సైన్యం యొక్క సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో, "ఇరాన్ మద్దతు గల హౌతీ ఉగ్రవాదులకు ఇంధనం అందించే ఈ మూలాన్ని తొలగించడానికి, 10 సంవత్సరాలకు పైగా ఈ మొత్తం ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా హౌతీ చేసిన విధ్వంసాలకు నిధులు సమకూర్చిన అక్రమ ఆదాయాన్ని తొలగించడానికి యుఎస్ దళాలు ఈ చర్య తీసుకున్నాయి" అని పేర్కొంది. అయితే, "ఈ దాడి యెమెన్ ప్రజలకు హాని కలిగించడానికి ఉద్దేశించబడలేదు. వారు హౌతీ ఆధిపత్యాన్ని విడిచిపెట్టి శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారు" అని సెంట్రల్ కమాండ్ జోడించింది.

అయితే, ఈ దాడిలో పౌరులు చంపబడ్డారన్న దానిపై సెంట్రల్ కమాండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. కాగా, అంతకుముందు, ఇరానియన్ మద్దతు గల హౌతీలు శుక్రవారం ఇజ్రాయెల్ వైపు క్షిపణిని ప్రయోగించారని, దానిని తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు, చైనా ఉపగ్రహ సంస్థ హౌతీ దాడులకు "ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందని" అమెరికా ఆరోపించడంతో యెమెన్ యుద్ధం మరింత అంతర్జాతీయమైంది. అయితే, చైనా దీనిపై నేరుగా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

ఇలా ఉండగా, యెమెన్‌లో హూతీలను ఏరిపారేసే లక్ష్యంతో అమెరికా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ జల మార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా తిరగకుండా ఏ ఉగ్రవాద సంస్థా అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులను యుద్ధ నేరంగా భావిస్తామని హౌతీలు అంటున్నారు. మరోవైపు హూతీలకు మద్దతీయడం మానుకోవాలని ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై ఇరాన్‌ గట్టిగా బదులిస్తోంది. ఉగ్రవాద సంస్థల విధానాల రూపకల్పనలో తమ పాత్రమీ లేదని చెబుతోంది.

US Strike 3.jpg

US Strike 1.jpg


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2025 | 09:37 PM