Telegram CEO: నా వీర్యదానంతో.. సంపద, టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:39 AM
దిగ్గజ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ మరో బాంబు పేల్చారు. ప్రపంచవ్యాప్తంగా తన వీర్యదానంతో పుట్టిన 100 మందికి పైగా పిల్లలకు తన ఆస్తినంతా పంచేస్తానని ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ మరో బాంబు పేల్చారు. ప్రపంచవ్యాప్తంగా తన వీర్యదానంతో పుట్టిన 106 మంది పిల్లలకు తన ఆస్తినంతా పంచేస్తానని ప్రకటించారు. ఈమేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. తాజాగా ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వీర్యదానం ద్వారా పుట్టిన పిల్లలు, వాళ్లకి తన ఆస్తి పంపకం మీద మాట్లాడారు పావెల్ దురోవ్. దీనికి సంబంధించి ఇటీవలే తాను వీలునామా రాశానని, అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాదు, తనకు సహజంగా పుట్టిన పిల్లలతోపాటు, వీర్యదానం ద్వారా జన్మించిన 106 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు.
సుమారుగా 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానన్నారు. అయితే, ఈ సంపదను 30 ఏళ్ల వరకు వారు పొందలేరని.. ఎందుకంటే, తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పావెల్ దురోవ్ పేర్కొన్నారు. తనకు పెళ్లి కాకపోయినా వీర్యదానం ద్వారా తనకు వంద మంది పిల్లలున్నారని గతంలో దురోవ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు జన్మించినట్లు గతేడాది జులైలో దురోవ్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇవి కూడా చదవండి:
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి