Woman Attempt To Burn Cockroach: బొద్దింకను చంపడానికి అపార్ట్‌మెంటే కాల్చేసింది..
ABN , Publish Date - Oct 21 , 2025 | 03:08 PM
కొద్దిసేపటికే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో ఫ్లోర్‌లో 30 ఏళ్ల ఓ మహిళ తన భర్త, రెండు నెలల బిడ్డతో నివాసం ఉంటోంది. మంటలు వారి ఇంట్లోకి వ్యాపించాయి.
ప్రతీ ఇంట్లో కామన్‌గా ఉండే సమస్య ఏంటి అంటే.. అది కచ్చితంగా బొద్దింకలే. వాటిని చూస్తేనే కొంతమందికి ఒళ్లంతా జలదరిస్తుంది. బొద్దింకల్ని కంట్రోల్ చేయడానికి ఒక్కోరు ఒక్కో టెక్నిక్ వాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం బొద్దింక కనిపించగానే ఏలాగైనా సరే చంపాలన్న కసితో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓ యువతి బొద్దింకను చంపడానికి చేసిన ప్రయోగం బెడిసి కొట్టి మహిళ ప్రాణం పోయింది. 8 మంది దాకా గాయపడ్డారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన 20 ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం నాడు ఆ యువతి తన ఫ్లాట్‌లో పనులు చేసుకుంటూ ఉండగా బొద్దింక కనిపించింది. బొద్దింకను చూడగానే ఆ యువతి ఆగ్రహంతో ఊగిపోయింది. దాన్ని చంపడానికి ఓ పిచ్చి పని చేసింది. లైటర్, మండే స్వభావం ఉన్న స్ప్రే సహాయంతో బొద్దింకను చంపే ప్రయత్నం చేసింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది.
ఆ స్ప్రే కారణంగా ఇంట్లోని వస్తువులకు మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో ఫ్లోర్‌లో 30 ఏళ్ల ఓ మహిళ తన భర్త, రెండు నెలల బిడ్డతో నివాసం ఉంటోంది. మంటలు వారి ఇంట్లోకి వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ మహిళ ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. మంటలు, పొగ కారణంగా 8 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంత ఘోరానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..
టోల్ గేట్లను తెరిచారు.. వాహనాలను ఉచితంగా పంపించారు!