Share News

Earthquake strikes Argentine: దక్షిణ అమెరికాలో భారీ భూకంపం.. సునామీ అలర్ట్

ABN , Publish Date - May 02 , 2025 | 08:56 PM

దక్షిణ అమెరికా సమీపంలోని డ్రేక్ జలసంధిలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత కలిగిన ఈ భూకంపంతో చిలీ అర్జెంటీనా దక్షిణ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake strikes Argentine: దక్షిణ అమెరికాలో భారీ భూకంపం.. సునామీ అలర్ట్
Argentina earthquake

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిట్కర్ స్కేలుపై 7.4 తీవ్రత కలిగిన ఈ భూకంప కేంద్రం అర్జెంటీనాలోని ఉషుయా ప్రాంతానికి 219 కిలోమీటర్ల దూరంలో డ్రేక్ జలసంధిలో ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. దీంతో, స్థానిక అధికారులు అర్జెంటీనా, చిలీ దేశాల్లోని తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అలర్ట్‌లు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంత ప్రజలందరినీ దూరంగా తరలివెళ్లాలని అధికారులు కోరారు.


సముద్రపు అలలు 3 నుంచి 10 అడుగుల ఎత్తు ఎగసి పడొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. దక్షిణ చిలీ తీర ప్రాంతాలతో పాటు అంటార్కిటికా ఖండంపై సునామీ ప్రభావం ఉండచ్చని పేర్కొంది. సునామీ తొలి అల అంత తీవ్రంగా ఉండకపోయినా తరువాత వచ్చే అలల తాకిడి ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, సునామీ సైరెన్లు మోగుతున్న అనేక వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..

ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు

పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!

మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత

Read More Latest Telugu News and International News

Updated Date - May 02 , 2025 | 09:01 PM