Indian Consulate in Melbourne: ఆస్ట్రేలియాలోని ఇండియన్ కాన్సులేట్‌పై వికృత చేష్టలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:03 PM
ఆస్ట్రేలియాలో భారత్ మీద ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి తమ వెర్రితనాన్ని, పిచ్చి చేష్టల్ని బయటపెట్టారు కొందరు దుండగులు.

ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశం. అయితే, అక్కడ కూడా కొందరు అల్లరి మూకలు నీచపు పనులు చేస్తూనే ఉంటారు. భారత్ మీద అక్కసు అనుకోవాలో చేతివాటమనుకోవాలో తెలియదుగాని తాజాగా మరోసారి తింగరి చేష్టలకు దిగారు. మెల్‌బోర్న్‌నగరంలోని భారత కాన్సులేట్ కార్యాలయం దగ్గర తింగరి పనులు చేశారు. ఆఫీస్ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. 344 సెయింట్ కిల్డా రోడ్‌లోని కాన్సులేట్ భవనం ముందు ఉన్న నేమ్ బోర్డు పై ఎర్రటి ఇంకుతో పిచ్చి గీతలు గీశారు.
అయితే, ఈ విషయాన్ని కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ లేవనెత్తింది. దీనికి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం (X) ద్వారా తెలిపింది. "మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రాంగణంలో దుండగులు ధ్వంసం చేసిన ఘటనను ఆస్ట్రేలియా అధికారులతో ప్రస్తావించాము. దేశంలోని భారత దౌత్య, కాన్సులేట్ ప్రాంగణాలు, సిబ్బంది భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు" అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
మెల్ బోర్న్ పోలీసు ప్రతినిధి ఈ ఘటన వివరాలను తెలియచేస్తూ, "భవనం ముందు ప్రవేశ ద్వారం దగ్గర బుధవారం రాత్రి గం. 9 తర్వాత దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాలో ఇది మొదటి భారత వ్యతిరేక ఘటన కాదు. 2023లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన తర్వాత, బ్రిస్బేన్‌లోని భారత కాన్సులేట్‌కు ఖలిస్తాన్ జెండాలు కట్టి ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీలు తమ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. మరొక ఘటనలో సిడ్నీలోని బిఎపిఎస్ స్వామినారాయణ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇలాంటిదే మరో ఘటన కూడా చోటు చేసుకుంది. గతేడాది అక్టోబర్‌లో, ముసుగు ధరించిన కొందరు ఉగ్రవాదులు ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలోని రెండు హిందూ దేవాలయాలలోకి చొరబడి విధ్వంసం చేశారు.
Read Also: NTPC Recruitment 2025: ఎన్టీపీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్..ఈ అభ్యర్థులకు మంచి ఛాన్స్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Admissions: అడ్మిషన్లలో కార్పొ‘రేట్’ దందా..