Diwali-Skin Care: ఈ దీపావళికి మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చేసి చూడండి
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:55 PM
ఈ దీపావళి పండుగకు కొత్త అందంతో మెరిసిపోవాలనుకుంటున్నారా? చర్మం కాంతులీనేలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ న్యూట్రిషనిస్టు చెబుతున్న సూచనలను ఓసారి ఫాలో అయ్యి చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది రోజుల్లో దీపావళి. ఈ పండగకు అద్భుతమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోవాలని కోరుకునే వారు కొన్ని చిట్కాలు పాటించాలని సాక్షి లాల్వానీ అనే న్యూట్రిషనిస్టు తెలిపారు. ఆమె షేర్ చేసిన అప్‌డేట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆమె సూచనల ప్రకారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి (Skin Care Tips for Diwali).
పండుగ నాటి వరకూ ప్రతి రోజు ఉదయం టీస్పూను ఉసిరి జ్యూస్, అర టీస్పూను అలోవిరా జ్యూస్, చిటికెడు పసుపు, కప్పు నీళ్లలో కలిపి తాగితే చర్మం కాంతివంతం అవుతుంది. ఉసిరి వల్ల చర్మం ముడతలు తగ్గుతుంది. ఆలోవిరా వల్ల స్కిన్ ఇరిటేషన్ మటుమాయం అవుతుంది. పుసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
రోజువిడిచి రోజు జామ, వాల్‌నట్స్, ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక పండుగ వరకూ ప్రతి రోజు సాయంత్రం.. సొంపు, కొత్తిమీర, జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగితే లివర్‌లోని విషతుల్యాలు తొలగిపోతాయి. చర్మంపై నల్లమచ్చలు మటుమాయం అవుతాయి. మొటిమల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
రాత్రంతా నానబెట్టిన గోండ్ కతిరాకు రోజు వాటర్, సబ్జా గింజలు, నిమ్మరసాన్ని జోడించి వారానికి మూడు నాలుగు సార్లు తాగితే శరీరానికి తగినంత తేమ అందుతుంది. నిస్సారంగా కనిపిస్తున్న చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది. చర్మం ఉబ్బినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది.
పెసరపప్పు, మెంతికూరతో చేసిన కిచిడీకి ఒక టీస్పూను నెయ్యి జోడించి తింటే శరీరానికి జింక్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది చర్మంలో డల్‌నెస్ తొలగిపోతుంది. రాబోయే పది రోజులు ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తే చర్మం కాంతులీనుతూ ఉంటుందని సదరు న్యూట్రిషనిస్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ రెసీపీలను ఎంజాయ్ చేయండి.
ఇవి కూడా చదవండి:
జీవితంలో సంతోషం ఉచ్ఛస్థితికి చేరేది ఈ ఏజ్‌లోనే అంటున్న శాస్రవేత్తలు
కారులో ఇంధనాన్ని ఆదా చేయాలనుకుంటున్నారా.. ఈ ఒక్క బటన్‌ను ప్రెస్ చేస్తే..