Juice Centers: అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌లీ జ్యూస్ సెంటర్లు
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:15 PM
ఫ్రూట్ జ్యూస్ తాగితే హెల్తీగా ఉండొచ్చని ఆయా సెంటర్లకు వెళ్తుంటారు జనం. అయితే, హైదరాబాద్‌లోని కొన్ని షాపుల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ ఆధికారులు చెప్పిన వివరాలు వింటే..

Food Safety: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఫ్రూట్ జ్యూస్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జ్యూస్ తయారు చేసే పరిసరాలు పూర్తి అపరిశుభ్రంగా ఉన్నాయనని అధికారులు పేర్కొన్నారు. తుప్పు పట్టిన కత్తులతో జ్యూస్ సెంటర్ నిర్వాహకులు ఫ్రూట్స్ కట్ చేస్తున్నారని, ఫ్రూట్స్ స్టోర్ చేసే ఫ్రిడ్జ్‌లో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పాడైన ఫ్రూట్ సలాడ్‌ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అమ్ముతున్నారని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని బాంబే జ్యూస్ సెంటర్, నాచురల్ ఫ్లేవర్స్, కోకోనట్ జ్యూస్ బార్, KGN జ్యూస్ సెంటర్లకు నోటీసులు ఇచ్చామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News