Anant Singh: జైలుకు వెళ్లినా.. 28,000 ఆధిక్యంతో గెలుపు..
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:37 PM
శుక్రవారంనాడు జరిగిన కౌంటింగ్‌లో అనంత్ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి వీణాదేవిపై ఆయన గెలిచారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ నియోజకవర్గమైన మొకామా (Mokama) ఇటీవల వార్తల్లో ప్రధానంగా నిలిచింది. ఆ నియోజకవర్గంలో హింసాకాండ చెలరేగి ప్రశాంత్ కిషోర్ 'జనసురాజ్' మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్యకు గురికావడం సంచలనం అయింది. ఇందుకు సంబంధించి మొకామా నియోజకవర్గం జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ (Ananta Kumar Singh)ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ఈ నియోజకవర్గం ఫలితాలపై ఉత్సుకత నెలకొంది. అయితే శుక్రవారంనాడు జరిగిన కౌంటింగ్‌లో అనంత్ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి వీణాదేవిపై ఆయన గెలుపొందారు. ఆయనకు 91,416 ఓట్లు రాగా, వీణాదేవి 63,210 ఓట్లు గెలుచుకున్నారు.
పలు క్రిమినల్ ఆరోపణలు, జైలుకు వెళ్లిన వివాదాస్పద నేపథ్యం అనంత్ కుమార్ సింగ్‌కు ఉంది. రెండు దశాబ్దాలుగా మొకామాలో ఆయనకు గట్టిపట్టు ఉంది. మొకామా చోటాసర్కర్‌గా పేరున్న ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005, 2010లో జేడీయూ ఆభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 2015లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2020లో ఆయన ఆర్జేడీలో చేరి గెలుపొందారు. అయితే క్రిమినల్ కేసులో దోషిగా నిర్దారణ కావడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. దాంతో ఆయన భార్య నీలం దేవి ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈసారి సింగ్ నేరుగా జేడీయూ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆర్జేడీ, జన్‌సురాజ్ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ నియోజకవర్గం ప్రజల్లోనూ, రాజకీయంగానూ గట్టి పట్టు ఉండటంతో ఆయన మరోసారి తన సత్తా చాటుకున్నారు. జన్‌సురాజ్ కార్యకర్త హత్యలో తన ప్రమేయం ఏమీ లేదని ఇప్పటికే సింగ్ వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు
అమిత్ షా చెప్పింది నిజమే.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం 180 ప్లస్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..