Tejashwi Yadav: సర్వేల్లో నిజం లేదు..18న ప్రమాణస్వీకారం చేస్తాం
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:02 PM
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
పాట్నా: బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కొట్టివేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే ఈ సర్వేలు వచ్చాయని తేజస్వి అన్నారు. సాయంత్రం 7 గంటల వరకూ ఓటు వేసేందుకు జనాలు క్యూలో నిలుచున్నారని, ఓటింగ్ ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
'ఎగ్జిట్ పోల్స్ సరికాదు. గతంలో కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. భారీ మెజారిటీతో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పెద్దఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. వాళ్ల ఓట్లన్నీ మహాగఠ్‌బంధన్‌కు అనుకూలంగానే వేశారు. నవంబర్ 18న మేము ప్రమాణస్వీకారం చేస్తాం' అని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు.
కాగా, మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి. ఆర్జేడీ అవకాశాలను కొత్తగా ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ గండికొట్టిందని అంచనా వేశాయి. మరోవైపు, మంగళవారంనాడు జరిగిన రెండో విడత పోలింగ్‌లో 69 శాతంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నవంబర్ 6న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 65.9 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో భారీగా పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా వచ్చినట్టు ఇటు ఎన్డీయే, అటు మహాగఠ్‌బంధన్ అంచనా వేస్తున్నాయి. ఓటరు తీర్పు ఏమిటనేది నవంబర్ 14న కౌంటింగ్ తరువాత స్పష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి..
బిహార్‌రెండో దశలో భారీగా 68.79శాతం పోలింగ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి