Bihar Exit Polls 2025: ఎగ్జిట్ పోల్ ఫలితాలు..గెలుపు ఎవరిందంటే
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:53 PM
బిహార్‌లో విజయకేతనం ఎగరేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్‌కు ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలును వెల్లడించాయి.
పాట్నా: హోరాహోరీగా రెండు విడతలుగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) పోలింగ్ మంగళవారంతో ముగిసింది. చివరి విడత పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియడంతో 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి. బిహార్‌లో విజయకేతనం ఎగురేసేది ఎవరనేత విషయాన్ని రిజల్ట్‌కు ముందే చెప్పేశాయి. గెలుపే లక్ష్యగా ఎన్డీయే, ఇండియా కూటమి తలపడగా, తొలిసారి ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ సైతం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగింది. ఓటర్ల అభిప్రాయం ఏవిధంగా ఉంది? పార్టీ గెలవనుంది? అనే దానిపై సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు మీకోసం..
బీహార్‌లో ఎన్‌డీఏ జయకేతనం-పీపుల్స్ పల్స్
బీహార్ బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ పేర్కొంది.

ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలు ఉంటాయని తెలిపింది. మహాగట్ బంధన్ లోని ఆర్జేడీ 62-69, కాంగ్రెస్ 9-18, సీపీఐ(ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది.
నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0-2, సీపీఐఎంకి 0-3, వీఐపీకి 0-5, సీపీఐ 0-2, ఇతరులు 2-8 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. బీజేపీకి 21.4 శాతం, ఆర్జేడీకి 23.3 శాతం, జేడీయూకి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జేపీకి 5 శాతం, ఇతరులకు 7.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు... తేజశ్వీ యాదవ్ కి 32 శాతం మంది, నితీశ్ కుమార్ కి 30 శాతం, ప్రశాంత్ కిషోర్ కి 8 శాతం, చిరాగ్ పాశ్వాన్ కి 8 శాతం, సామ్రాట్ చౌదరికి 6 శాతం, రాజేశ్ కుమార్ కి 2 శాతం మద్దతిచ్చారని పేర్కొంది. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతులో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా, ముస్లిం, బుద్ధిస్టులు, ఓబీసీ సామాజిక వర్గాల్లో అధికశాతం మంది మహాఘట్ బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ముగిసిన బిహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్
ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
కామాఖ్య ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్..
బీహార్ ఎన్నికలకు సంబంధించిన మ్యాట్రిజ్ సర్వే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్..