Share News

AI Impact On Education: ఏఐతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. నిజాయతీ నిరూపించుకునేందుకు విద్యార్థుల పాట్లు

ABN , Publish Date - May 19 , 2025 | 12:52 PM

ఏఐతో కాపీ కొట్టే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో నిజాయితీగా ఉండే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాము కాపీ కొట్టలేదని నిరూపించుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

AI Impact On Education:  ఏఐతో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. నిజాయతీ నిరూపించుకునేందుకు విద్యార్థుల పాట్లు
AI plagiarism detection

ఇంటర్నెట్ డెస్క్: విద్యావ్యవస్థపై ఏఐ పెను ప్రభావం చూపుతోంది. స్కూలు విద్యార్థులు ఏఐతో హోం వర్కులు పూర్తిచేసి విద్యానైపుణ్యాలకు దూరమవుతున్నారు. అయితే, కాలేజీ విద్యార్థులకు మాత్రం ఏఐ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఏఐతో చేసిన అసైన్‌మెంట్స్ గుట్టురట్టు చేసేందుకు యూనివర్సిటీలు ఇప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్లను ఆశ్రయిస్తున్నాయి. ఇవి పొరపాట్లు చేస్తుండటంతో నిజాయితీగా అసైన్‌మెంట్స్ పూర్తి చేసిన విద్యార్థులు నష్టపోతున్నారు. ఏఐతో కాపీకొట్టామన్న నీలాపనిందనలను ఎదుర్కొంటున్నారు. కొందరికి డిగ్రీల జారీలో ఆలస్యం జరుగుతోంది.

విద్యార్థులు సొంతంగా పూర్తిచేసిన అసైన్‌మెంట్స్‌ను కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ఏఐ నుంచి కాపీ కొట్టినట్టుగా చెబుతున్నాయి. దీంతో, విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తమ తప్పులేదని నిరూపించుకునే క్రమంలో అష్టకష్టాలు పడుతున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు తాము కంప్యూటర్‌పై అసైన్‌మెంట్స్ రాసుకునే సమయంలో స్క్రీన్ రికార్డింగ్ వీడియోలను సిద్ధం చేసుకుంటున్నారు. తమపై ఆరోపణలు వస్తే నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఈ వీడియోలను ఆధారాలుగా భద్రత పరుచుకుంటున్నారు.


కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీ సాఫ్ట్‌వేర్లు విద్యార్థులు చేసిన అసైన్‌మెంట్స్‌ను ఏఐతో చేసినట్టు తప్పుగా గుర్తించడంతో మార్కులు తగ్గిపోతున్నాయి. పరీక్ష పాస్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏఐ రాసిన అసైన్‌మెంట్స్ గుర్తించడంలో కొన్ని సాఫ్ట్‌వేర్లు 6.8 శాతం సందర్భాల్లో తప్పులు చేస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యయనంలో తేలింది.

దీనిపై విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో యూసీ బర్క్‌లీ, జార్జ్ టౌట్ యూనివర్సిటీలు ఏఐ డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించడం మానుకున్నాయి.


కొందరు ప్రొఫెసర్లు కూడా తాము ఇచ్చే అసైన్‌‌మెంట్స్‌లో మార్పులు చేస్తున్నారు. వ్యక్తిగతస్థాయిలో అసైన్‌మెంట్స్ ఇస్తూ వీటిపై నేరుగా విద్యార్థులతో చర్చించి కాపీ కొట్టేందుకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు మాత్రం యథాప్రకారం తమ హోం వర్కుల కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్.. ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

IDBI బ్యాంకులో భారీ నియామకాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..

మరిన్ని విద్యాసంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 01:01 PM