యూజీసీ నెట్ 2025
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:41 AM
యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పీహెచ్‌డీ, జూనియర్ రిసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్) ప్రవేశాలకు 2025 సంవత్సరానికిగానూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్...

అడ్మిషన్స్
యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పీహెచ్‌డీ, జూనియర్ రిసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్) ప్రవేశాలకు 2025 సంవత్సరానికిగానూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 85 సబ్జెక్టులకుగానూ ఈ టెస్ట్‌లు జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
చివరి తేదీ: 2025 మే 7
ప్రవేశ పరీక్ష ప్రారంభం: 2025 జూన్ 21 నుంచి 30 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1150/-, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రూ.600/-, ఎస్సీ,ఎస్టీ పీడబ్ల్యూబీడీ 325/-
వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in
ఐఐటీ మద్రా్‌సలో కొత్త పీజీ డిప్లొమా
ఎమర్జింగ్ టెక్నాలజీ డొమైన్ల మీద నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారి కోసం ఐఐటీ మద్రాస్ కొత్త పీజీ డిప్లొమా(వెబ్ ఎంటెక్) కోర్సును ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్ కోర్సులను తాజా గ్రాడ్యుయేట్లతోపాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేయవచ్చు. ప్రోగ్రామ్‌ను రకాల వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ఈ తరగతులు సాయంకాలం, వారాంతాల్లో నిర్వహిస్తారు. ఈ సమయాల్లో కూడా హాజరు కాలేజీ వారు రికార్డింగ్ సెషన్‌ల ద్వారా అటెండ్ కావచ్చు.
ఏరో స్పేస్ ఇంజనీరింగ్(ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎమ్యునిటేషన్ టెక్నాలజీ), ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీ మీడియా, మైక్రో ఎలకా్ట్రనిక్స్), మెకానికల్ ఇంజనీరింగ్(మెకానికల్ డిజైన్, అటోమేటీవ్ టెక్నాలజీ), ఇంజనీరింగ్ డిజైన్(ఈ మొబిలిటీ), ప్రాసెస్ సేఫ్టీపై ఈ కోర్సులను అందిస్తున్నారు. '
ఆసక్తిగల అభ్యర్థులు 2025 మే చివరి వరకు దరఖాస్తు చేయవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష 2025 జూలై 13న జరుగుతుంది. 2025 ఆగస్టు/సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://code.iitm.ac.in/webmtech వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఉర్దూ వర్సిటీలో కోర్సులు
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు లు ప్రధాన క్యాంప్‌సతోపాటు, అనుబంధ క్యాంపస్‌ల్లో ఉన్నాయి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఉర్దూ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా టెన్త్/ఇంటర్/గ్రాడ్యుయేషన్‌లో ఉర్దూ మీడియంలో చదివి ఉండాలి. లేదా ఉర్దూ సమానమైన మదరసా కోర్సులు పాసై ఉండాలి. భాషా కోర్సులు తప్ప బోధన ఉర్దూలో ఉంటుంది. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2005 మే 13. ప్రవేశ పరీక్షలు జూన్ రెండో వారంలో ఉంటాయి. పూర్తి వివరాలకు manuucoe.in/regularadmission/ వెబ్‌సైట్ చూడవచ్చు.
For Andhrapradesh News And Telugu News