Share News

ప్రతి అటెంప్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:16 AM

జ: మాది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూరులో, ఆరు నుంచి పది వరకు కాగజ్‌నగర్‌ నవోదయ, తరవాత త్రిచిలోని త్రిబుల్‌ ఐటీలో బీటెక్‌ మెకానికల్‌ పూర్తి చేశాను. నాన్నపేరు...

ప్రతి అటెంప్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్‌

సివిల్స్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

సాయి చైతన్య జాదవ్‌

68వ ర్యాంకు

మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఎంత వరకు చదువుకున్నారు?

జ: మాది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూరులో, ఆరు నుంచి పది వరకు కాగజ్‌నగర్‌ నవోదయ, తరవాత త్రిచిలోని త్రిబుల్‌ ఐటీలో బీటెక్‌ మెకానికల్‌ పూర్తి చేశాను. నాన్నపేరు గోవింద్‌జాదవ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌. అమ్మ కవిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అక్క శృతి, వైద్యురాలు.

సివిల్స్‌లో మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది? ఈ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు?

జ: 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. ఆ తరవాత ఢిల్లీకి వెళ్లి ఒక సంవత్సరం కోచింగ్‌ తీసుకుందాం అనుకున్నాను. అయితే కొవిడ్‌ ఎఫెక్ట్‌తో మధ్యలోనే వదిలేసి వచ్చేశాను. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ కూడా క్వాలిఫై కాలేదు. 2020, 2021లో మళ్లీ రాశాను. అయితే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించా, కాని మెయిన్స్‌ దాటలేదు. 2022లో ఇంటర్వ్యుకు వెళ్లాను. కానీ ర్యాంకు రాలేదు. మళ్లీ 2023లో మెయిన్స్‌ దశ దాటలేక పోయాను. అయితే అదే సంవత్సరం ‘ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌’ వచ్చింది. ఆరో ప్రయత్నంలో 2024లో విజయం సాధించాను. నా ర్యాంకుకు ఐఏఎస్‌ రావచ్చు.


మొదటి సారి విఫలమైనప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్‌ చేసుకున్నారు....?

జ: సివిల్స్‌ పరీక్షలు రాసిన ప్రతీసారి నాలో కొంత ఇంప్రూమెంట్‌ కనిపించింది. అదే ప్రధాన కారణం. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. దీంతో ఏదో వస్తుందన్న ఆశ పెరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహాంతో పాటు స్నేహితులు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు.

రోజుకు ఇన్ని గంటలు చదవాలన్న నియమం ఏమైనా పెట్టుకున్నారా?

జ: ఎన్ని గంటలు ప్రిపేర్‌ అనేది కాదు కాని ఎంత చదివితే అర్థమవుతుందో అంత వరకే చదివే వాడిని. పరీక్షలు దగ్గర పడినప్పుడు మాత్రం రోజుకు 10 నుంచి 13 గంటలు చదివే వాడిని. ఎన్ని గంటలు చదివాము అన్నది కాకుండా, ఎంత అర్థం చేసుకో గలిగాం అన్నది ముఖ్యం.

సివిల్స్‌ రాయాలంటే కోచింగ్‌ తప్పనిసరా?

జ: నా ఉద్దేశ్యంలో కోచింగ్‌ అవసరం లేదు. ఒకరిని చూసి మరొకరు కోచింగ్‌కు వెళుతున్నారు. ఏదో కొంత తప్ప, గత కోచింగ్‌ ప్రస్తుతం ఉపయోగపడతుందన్న గ్యారెంటి లేదు. స్నేహితులను చూసి నేను కూడా కోచింగ్‌కి వెళ్లాను. కాని మధ్యలోనే వచ్చేశాను. ఐదేళ్లుగా సొంతంగానే సిద్ధం అయ్యాను. కాకపోతే స్నేహితులతో కలిసి మాక్‌ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది.


జనరల్‌ స్టడీ్‌సకు, అలాగే ఆప్షనల్‌కు ఏ మెటీరియల్‌ చదివారు....?

జ: రోజు న్యూస్‌ పేపర్‌ చదవడంతో మన చుట్టు పక్కల ఏం జరుగుతుందనే విషయంపై అవగాహన వస్తుంది. ఇది ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఇలా అన్ని స్థాయిల్లో ఉపయోగపడుతుంది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కొ రకమైన ప్రామాణిక బుక్స్‌ అవసరం. ఉదాహరణకు నా ఆప్షన్‌ ఆంథ్రోపాలజి. మొదటి నుంచి దీనితోనే సివిల్స్‌ రాస్తున్నాను. మొదట్లో ఒక నెల రోజులు కోచింగ్‌ వెళ్లినా అంతగా అర్థం కాలేదు. మొదటి సారి మెయిన్స్‌ రాక పోవడంతో ఎక్కువ సమయం దొరికింది. దాంతో సొంతగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నాను.


సివిల్స్‌లో మిమ్మల్ని ఏ బోర్డు ఇంటర్వ్యూ చేసింది...? ఎంత సేపు జరిగింది. ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

జ: నన్ను రాజ్‌శుక్లా సర్‌ బోర్డు 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసింది. ఆరోజు నాలుగో వ్యక్తిని. ఇంటర్వ్యూ ఆప్లికేషన్‌ ఫాంలో మొత్తం 22 సర్వీ్‌సలను పేర్కొనాల్సి ఉండగా నేను ఐఏఎస్‌, ఐపీఎస్‌ రెండు సర్వీ్‌సలను మాత్రమే పెట్టాను. ఇంటర్వ్యూలో దీనిపై అడిగారు. నాకు ఆల్‌ రెడీ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ సంబంధించిన ‘ఐఎఫ్‌ఎస్‌’ సర్వీస్‌ ఉందని చెప్పాను. ఏపీ నుంచి విడిపోయిన తరవాత తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది. అలాగే కేవలం హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చెందిందా? అని అడిగారు. నా సొంత జిల్లా ఆదిలాబాద్‌ కాబట్టి అడవుల గురించి అడిగారు. తెలంగాణ ఉద్యమం గురించి, ఆదిలాబాద్‌ గిరిజన తెగల గురించి ప్రశ్నించారు. మా నాన్న పోలీసు కాబట్టి ఆ డిపార్ట్‌మెంట్‌ గురించి కూడా అడిగారు.

ఎం. రాజేశ్వర్‌, అదిలాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:17 AM