Share News

IDBI Bank Recruitment 2025: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఓ

ABN , Publish Date - May 12 , 2025 | 06:33 AM

ఐడీబీఐ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది...

IDBI Bank Recruitment 2025: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఓ

ఐడీబీఐ బ్యాంకు

జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఓ

ఖాళీలు : 676

ఐడీబీఐ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం.

వయస్సు: అభ్యర్థి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2000 మే 2 నుంచి 2005 మే 1 తేదీల మధ్యలో జన్మించి ఉండాలి)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 20

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌

పరీక్ష తేదీ: 2025 జూన్‌ 8

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ భాషా 40 ప్రశ్నలు(40 మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాల్సిస్‌, ఇంట్రప్రిటేషన్‌ 60 ప్రశ్నలు(60 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమి, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌, ఐటీ 60 ప్రశ్నలు(60 మార్కులు), క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు(40 మార్కులు) ఉంటాయి.

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 06:53 AM