Share News

రాజంపేటపై అడిగారు?

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:03 AM

కలలు కనడం కాదు.. వాటిని సాకారం చేసుకోవాలనే అబ్దుల్‌ కలామ్‌ మాటలు అతనిలో స్ఫూర్తి నింపాయి. బీటెక్‌లో సీనియర్స్‌ ఎక్కువ మంది సివిల్స్‌వైపు వెళ్లడంతో తాను ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారు...

రాజంపేటపై అడిగారు?

సివిల్స్‌ ర్యాంకర్స్‌ వాయిస్‌

చెన్నంరెడ్డి శివ గణేష్‌ రెడ్డి

119వ ర్యాంకు

రాజంపేటపై అడిగారు?

కలలు కనడం కాదు.. వాటిని సాకారం చేసుకోవాలనే అబ్దుల్‌ కలామ్‌ మాటలు అతనిలో స్ఫూర్తి నింపాయి. బీటెక్‌లో సీనియర్స్‌ ఎక్కువ మంది సివిల్స్‌వైపు వెళ్లడంతో తాను ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారు కడపకు చెందిన శివ గణేష్‌ రెడ్డి. అందుకు అనుగుణంగా ప్రయత్నించి విజయం సాధించారు. తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా మూడో ప్రయత్నంలో ఎలా విజయం సాధించారో వివరించారు.


కుటుంబ నేపథ్యం ఏమిటి. ఎంత వరకు చదువుకున్నారు?

జ: మధ్యతరగతి కుటుంబం మాది. సొంత ఊరు కడప పట్టణం అలంకానపల్లె. పదో తరగతి వరకు కడప, ఇంటర్మీడియట్‌ నెల్లూరులో, తరవాత హైదరాబాద్‌ ఐఐటిలో బీటెక్‌ పూర్తి చేశాను. ఐఐటిలో చదివే సమయంలో ఎక్కువ మంది సీనియర్లు సివిల్స్‌కు ఎంపిక అయ్యారు. దీంతో నేను ఎందుకు పరీక్ష రాయకూడదూ అనే ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగా ముందుకు సాగాను. నాన్న మల్లికార్జునరెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ ఫ్యాకల్టీగా చేశారు. ప్రస్తుతం వ్యవసాయం చూసుకుంటున్నారు. అమ్మ ఇందిరా ప్రియదర్శిని గృహిణి. చెల్లెలు శివ జ్యోతిక ప్రస్తుతం మాస్టర్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది.

ప్రస్తుతం ఏ సర్వీసు వస్తుందని అంచనా వేస్తున్నారు...?

జ: సివిల్స్‌లో నా ర్యాంకు 119. ఐఏఎస్‌ వస్తుందని అనుకుంటున్నాను. ఏ సర్వీసు వచ్చినా పర్వాలేదు.


మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది. రోజుకు ఇన్ని గంటలు చదవాలన్న నియమం ఏమైనా పెట్టుకున్నారా.....?

జ: సివిల్స్‌లో విజయం సాధించాలంటే ముఖ్యంగా సామాజిక, వర్తమాన అంశాలపై దృష్టి సారించాలి. క్రమం తప్పకుండా దిన పత్రికలు చదవాలి. ప్రిలిమినరీ పరీక్షలకు సిద్థమవుతున్న సమయంలోనే మెయిన్స్‌ అంశాలపై నిశిత దృష్టి సారించాలి. నా విషయానికి వస్తే రోజుకు 6 నుంచి 7 గంటల సేపు చదివాను. ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే 2020లో కోచింగ్‌లో చేరాను. సివిల్స్‌కు సన్నద్థమయ్యే వారికి కొన్ని పోర్టల్స్‌ అందుబాటులో ఉన్నాయి. మెయిన్స్‌కు ఎలా సిద్థమవ్వాలి. అక్కడ ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయో తెలుపుతూ ఆర్టికల్స్‌ ఇస్తారు. రోజుకు ఎన్ని గంటలు చదువుతున్నామన్నది కాదు ఆయా అంశాలను ఎలా అకళింపు చేసుకున్నామన్నదే కీలకం. క్రమశిక్షణగా ముందుకు సాగితే ఎంపికవడం సులభం.

ట సివిల్స్‌కు కోచింగ్‌ తప్పనిసరిగా తీసుకోవాలా?

జ: నా దృష్టిలో కోచింగ్‌ ఉంటే మంచిది. ప్రిపరేషన్‌ త్వరలో గాడిలో పడుతుంది. నేను 2020 లో బీటెక్‌ పూర్తయిన వెంటనే ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. కరోనా నేపథ్యంలో రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. తర్వాత రెండుసార్లు సివిల్స్‌ రాసినప్పటికీ ఫలితం రాలేదు. మూడో అటెం్‌ప్టలో జాతీయస్థాయిలో 119వ ర్యాంక్‌ వచ్చింది.

మిమ్మల్ని ఏ బోర్డు ఇంటర్వ్యూ చేసింది?

జ: చైర్మన్‌ ప్రీతి సుగం మేడమ్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూ అర్థగంట సేపు సాగింది. మనం ఇచ్చే డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌లో ఉన్న అంశాలపై ఇంటర్వ్యూ నిర్వహించారు.


ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలు లేదా ఆశ్చర్యానికి గురిచేసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా?

జ: కడప జిల్లాలో రాజంపేట సంబంధించి చెప్పమని ప్రశ్నించగా ఒక్కసారి ఆశ్చర్యపోయా. ఊహించని ప్రశ్న. అయినా సమాధానం చెప్పడంతో సంతృప్తి చెందారు. అలాగే కడప జిల్లాలో మహిళల సమస్యలు, వ్యవసాయ సమస్యలపై ప్రశ్నించారు వాటికి కూడా సమాధానం చెప్పడం జరిగింది.

విలియం జాన్‌ కళ్యాణ, ఎడ్యుకేషన్‌ రిపోర్టర్‌, కడప

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:17 AM