Share News

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఈ నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:48 AM

విద్యార్థుల జీవితంలో ‘క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌’ కీలకమైన దశ. ప్రధానంగా ఇంజనీరింగ్‌ డిగ్రీ పొందడానికి ముందే జాబ్‌ ఆఫర్‌ అందుకునేందుకు ఇది మంచి అవకాశం. దరిమిలా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో విజయం సాధించడానికి సరైన ప్రణాళికతో...

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఈ నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్‌

విద్యార్థుల జీవితంలో ‘క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌’ కీలకమైన దశ. ప్రధానంగా ఇంజనీరింగ్‌ డిగ్రీ పొందడానికి ముందే జాబ్‌ ఆఫర్‌ అందుకునేందుకు ఇది మంచి అవకాశం. దరిమిలా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో విజయం సాధించడానికి సరైన ప్రణాళికతో సిద్ధం కావాలి.

మొదటి నుంచే ప్లానింగ్‌: ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి మూడు సంవత్సరాల్లోనే ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన ప్లానింగ్‌పై దృష్టి పెట్టాలి. అది ఎలా అంటే..

అకడమిక్‌ ఫౌండేషన్‌: మొదటి సంవత్సరం నుంచి మంచి సీజీపీఏ ఉండేలా చూసుకోవాలి. చాలా కంపెనీలు 7.5 కంటే ఎక్కువ సీజీపీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తాయి.

కోర్‌ టెక్నికల్‌ స్కిల్స్‌ : సీ, సీ++, జావా, పైథాన్‌లతోపాటు డేటా స్ట్రక్చర్‌ అండ్‌ ఆల్గరిథమ్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌పై దృష్టిపెట్టాలి.

సాఫ్ట్‌స్కిల్స్‌: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవడంతోపాటు టీమ్‌ వర్క్‌ అలవాటు చేసుకోవాలి. క్లబ్స్‌/ ఈవెంట్స్‌ తదితరాల్లో పాల్గొనడం ద్వారా కొంతమేర నాయకత్వ లక్షణాలు అలవడతాయి.

ఇంటర్న్‌షిప్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌: ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, ఫ్రీలాన్స్‌ పనులు చేయడం ద్వారా ప్రాక్టికల్‌ అనుభవం సంపాదించుకోవాలి.

కోడింగ్‌: కోడ్‌చెఫ్‌, లీట్‌కోడ్‌, హాకర్‌రాంక్‌, కోడ్‌ఫోర్సెస్‌ తదితర కోడింగ్‌ పోటీల్లో పాల్గొంటే అనుభవం వస్తుంది.

టార్గెట్‌ కంపెనీస్‌ రీసెర్చ్‌: ఫైనల్‌ ఇయర్‌లో చేయాల్సిన పని ఇది. ఏయే కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్నాయో తెలుసుకుని, వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం యావత్తు సేకరించుకోవాలి.

ప్లేస్‌మెంట్‌ ట్రెండ్స్‌పై అవగాహన: ప్లేస్‌మెంట్స్‌ కోసం పలు రకాల కంపెనీలు వస్తుంటాయి. అందులో మీ ప్రాధాన్యం ఏమిటో చూసుకుని సిద్ధం కావాలి. ఉదాహరణకు ఐటీ, కోర్‌, అనలిటిక్స్‌, కన్సల్టింగ్‌ తదితర పనుల్లో విద్యార్థి తనకు దేనిపై ఆసక్తి ఉన్నదో చూసుకోవాలి.

ఏ రకమైన ఉద్యోగాలు: సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌, డేటా సైన్స్‌, కోర్‌ ఇంజనీరింగ్‌, కన్సల్టింగ్‌ తదితర ఉద్యోగాలపై అవగాహన పెంచుకోవాలి.

కంపెనీకి అనుగుణంగా ప్రిపరేషన్‌: సదరు కంపెనీలు గత సంవత్సరాల్లో రిక్రూట్‌మెంట్‌ ఎలా నిర్వహించాయో అర్థం చేసుకోండి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, టెక్నికల్‌ రౌండ్స్‌, హెచ్‌ఆర్‌ ప్రశ్నలు తదితరాలు ఉంటాయి. వీటికి అనుగుణంగా సిద్ధం కావాలి.


టెక్నికల్‌ ప్రిపరేషన్‌

ప్రోగ్రామింగ్‌ అండ్‌ డీఎస్‌ఏ: మాస్టర్‌ కీ కాన్సె్‌ప్ట్స(అరేస్‌, స్ట్రింగ్స్‌, లింక్డ్‌ లిస్ట్స్‌, ట్రీస్‌, గ్రాఫ్స్‌, డైనమిక్‌ ప్రోగ్రామింగ్‌) పెంచుకోవాలి.

సీఎస్‌ ఫండమెంటల్స్‌: ఓఎస్‌, డీబీఎంఎస్‌, ఓఓపీలు, సీఎన్‌(ఐటీ/సా్‌ఫ్టవేర్‌ ఉద్యోగాల కోసం) తదితరాలను రివైజ్‌ చేసుకోవాలి.

కోర్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్స్‌: నాన్‌ ఐటీ ఉద్యోగాల కోసం కోర్‌ కాన్సెప్టులను రివైజ్‌ చేసుకోవాలి.

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ప్రాక్టీస్‌: లీట్‌కోడ్‌, గీక్స్‌ ఫర్‌ గీక్స్‌ తదితర ప్లాట్‌ ఫారమ్‌లలో కనీసం 200పైన ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేయడానికి ప్రయత్నించాలి.

ఆప్టిట్యూడ్‌ అండ్‌ రీజనింగ్‌

సబ్జెక్టులతోపాటు ఆప్టిట్యూడ్‌ అండ్‌ రీజనింగ్‌పై దృష్టిపెట్టాలి.

  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్‌

  • లాజికల్‌ రీజనింగ్‌: పజిల్స్‌, సిల్లోగిజమ్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, కోడింగ్‌- డీకోడింగ్‌

  • వెర్బల్‌ ఎబిలిటీ: గ్రామర్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబులరీ(ఎమ్‌కాట్‌, కోకుబీస్‌ లాంటి పరీక్షలు)


మాక్‌ ఇంటర్వ్యూ, జీడీ, పీఐ ప్రాక్టీస్‌

టెక్నికల్‌ ఇంటర్వ్యూ: వైట్‌బోర్డ్‌పై కోడింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. సొల్యూషన్స్‌ను క్లియర్‌గా విడమర్చగలగాలి.

హెచ్‌ఆర్‌, బిహేవియరల్‌ రౌండ్స్‌: సాధారణంగా రెగ్యులర్‌గా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి సమాధానాలు ప్రాక్టీస్‌ చేయండి. ఉదాహరణకు ‘టెల్‌ మీ అబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌’, ‘వై షుడ్‌ వి హైర్‌ యు’, ‘డిస్ర్కైబ్‌ ఏ చాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌’ తదితరాలు అన్నమాట.

గ్రూప్‌ డిస్కషన్‌: కరెంట్‌ అఫైర్స్‌పై తాజా సమాచారంతో ఉండాలి. లాజికల్‌గా మాట్లాడడం రావాలి.

ప్లేస్‌మెంట్‌ రోజు: సరైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా ఫార్మల్‌గా ఉండేలా చూసుకుంటే బెటర్‌. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పాటించాలి. ఆత్మవిశ్వాసంతోపాటు, ప్రశాంతంగా ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే గాబరా పడవద్దు.

బ్యాకప్‌ ప్లాన్‌

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాకపోయినా ఆందోళన వద్దు. ప్రత్యామ్నాయాలు ఆలోచించుకుంటే చాలు. లింక్డిన్‌, ఏంజెల్‌ లిస్ట్‌, నౌకరీ, ఇండీడ్‌ తదితర సైట్లలో కూడా రెజ్యూమె అప్లయ్‌ చేసుకోవాలి.

హయ్యర్‌ స్టడీస్‌: గేట్‌, క్యాట్‌, జీఆర్‌ఈ పరీక్షలపై కూడా దృష్టి ఉంచుకోవాలి. ఏదీ వర్కౌట్‌ కాకుంటే ఎంబీఏ కోర్సులో చేరొచ్చు. స్టార్టప్స్‌, ఫ్రీలాన్సింగ్‌ వైపు కూడా ఆలోచించవచ్చు.

చివరగా

కాలేజీ సీనియర్లతో నెట్‌వర్క్‌ మెయింటెన్‌ చేయాలి. హైరింగ్‌ పద్ధతులను తెలుసుకోవాలి. ప్రీ ప్లేస్‌మెంట్‌ టాక్స్‌కి వెళితే సదరు కంపెనీల ఆంచనాలు ఏమిటో అర్థం అవుతాయి. టెక్‌ ట్రెండ్స్‌ గురించి అవగాహన పెంచుకోవాలి.

రెజ్యూమె, లింక్డిన్‌ ప్రొఫైల్‌

రెజ్యూమెను ఆకట్టుకునేలా తయారు చేసుకోవాలి. ఇందుకోసం పలు విషయాలు పొందుపరచాలి. అకడమిక్‌ పర్ఫార్మెన్స్‌ను హైలైట్‌ చేయాలి, ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షి్‌పలు, నైపుణ్యాలు, సాధించిన ఘనతలు పేర్కొనాలి.

లింక్డిన్‌, గిట్‌హబ్‌: ప్రాజెక్ట్‌లు, ఇతర అచీవ్‌మెంట్స్‌తో ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూనే ఉండాలి.


ఉదాహరణకు

కంపెనీలు కావాల్సిన నైపుణ్యాలు

  • టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఆప్టిట్యూడ్‌, బేసిక్‌ కోడింగ్‌

  • మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ డీఎస్‌ఏ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

  • అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కోడింగ్‌, సిస్టమ్‌ డిజైన్‌

  • ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌ కోర్‌ ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌

  • జేపీ మోర్గాన్‌, గోల్డ్‌మెన్‌ సాచ్‌ ఆప్టిట్యూడ్‌, డీఎస్‌ఏ, ఫైనాన్స్‌ బేసిక్‌

ప్రొఫెసర్‌

ఎన్‌. వి రమణారావు

డైరెక్టర్‌, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:48 AM