విష్ణుమూర్తి అవతారాలేమిటి?
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:11 AM
సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే సుదీర్ఘ ప్రయాణం. ఇందులో ఎన్ని ఆటుపోటులు వచ్చినా చివరి వరకు పట్టు విడవకూడదు. అలా విజేతగా నిలిచిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన బాన్న వెంకటేష్....

సివిల్స్ ర్యాంకర్స్ వాయిస్
బాన్న వెంకటేష్
15వ ర్యాంకు
విష్ణుమూర్తి అవతారాలేమిటి?
సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే సుదీర్ఘ ప్రయాణం. ఇందులో ఎన్ని ఆటుపోటులు వచ్చినా చివరి వరకు పట్టు విడవకూడదు. అలా విజేతగా నిలిచిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన బాన్న వెంకటేష్.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లో తన ప్రిపరేషన్ ఎలా సాగింది, ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో ‘దిక్సూచి’ పాఠకులతో ఆయన పంచుకున్నారు.
సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించినందుకు అభినందనలు.. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి.. ఏమి చదువుకున్నారు..?
జ: థాంక్యూ. మాది శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట గ్రామం. తొమ్మిదో తరగతి వరకు శ్రీకాకుళంలో, ఇంటర్‌మీడియట్ విశాఖపట్టణంలో.. బీటెక్ తమిళనాడు రాష్ట్రం తిరుచరాపల్లిలో పూర్తిచేశాను. నాన్న చంద్రరావు వ్యవసాయం చేస్తారు. అమ్మ రోహిణి గృహిణి. మా తమ్ముడు వంశీ ‘ఇస్రో’లో సైంటిస్ట్.
మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? సివిల్స్ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు?
జ: బీటెక్ తర్వాత నెలకు రూ. 1.5 లక్షలతో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాను. కానీ సంతృప్తిలేదు. ఏదైనా చేయాలన్న లక్ష్యంతో పాజిటివ్‌గా ఆలోచించాను. జాబ్‌కు రిజైన్ చేసి 2021 అక్టోబరు నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను.
ఈ ప్రయాణంలో తొలుత విఫలం అయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకున్నారు?
జ: 2022లో తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా దాటలేదు. కానీ డీమోటివేట్ కాకుండా సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ రెండో దఫా పరీక్షకు బాగా సిద్ధం అయ్యాను. 2023లో 467 ర్యాంకు వచ్చింది. ఆంధ్ర కేడర్ ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నేషనల్ పోలీస్ అకడామీలో ఉన్నా. 2024లో ఐఏఎస్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యాను.
ఇంత మంచి ర్యాంకు వస్తుందని ఊహించారా?
జ: నేను వంద నుంచి 150లోపు ర్యాంకు వస్తుందని ఊహించాను. 15వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావాలనుకున్నాను. అదే వచ్చింది.
రోజుకి ఇన్ని గంటలు తప్పనిసరిగా చదవాలనే నియమం ఏమైనా పెట్టుకున్నారా?
జ: సివిల్స్ అంటే చదువు విషయంలో ప్లానింగ్ ఉండాలి. రోజుకి ఎనిమిది గంటలు కచ్చితంగా చదివా. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే అయ్యేది.
సివిల్స్ లాంటి అత్యున్నత లక్ష్యం పెట్టుకున్నవారు కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాలా? ఒకవేళ మీరు కోచింగ్ తీసుకుంటే అది ఎలా ఉపయోగపడింది?
జ: ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యాను. మాక్ టెస్ట్‌లు రాశాను. బాగా ప్రిపేర్ అయ్యాను. రెండో అటెం్‌ప్టకు ఐపీఎస్ వచ్చింది. మూడో ప్రయత్నంలో ఐఏఎస్.
జనరల్ స్టడీ్‌సకు మెటీరియల్ ఏమి చదివారు? అలాగే ఆప్షనల్‌కు ఏమి మెటీరియల్ చదివారు?
జ: అందరి ప్రిపరేషన్‌లాగానే నాదీ జరిగింది. ఆప్షనల్‌గా ‘జాగ్రఫీ’ ఎంచుకున్నాను.
మిమ్మల్ని ఏ బోర్డు ఇంటర్వ్యూ చేసింది? మొత్తం ఎంత సేపు జరిగింది? ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎలాలంటి ప్రశ్నలు అడిగారు? ఏమైనా గుర్తున్నాయా?
జ: లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సర్ బోర్డు అరగంటకు పైగా నన్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఐపీఎ్‌సలో ఉన్నావుగా.. మరెందుకు ఐఏఎ్‌సకు రావాలనుకుంటున్నావు..? అనే ప్రశ్న వేశారు. అలాగే ఇంజినీరింగ్ అంశాలకు సంబంఽధించి కొన్ని అంశాలపై ప్రశ్నలు వేశారు. మీ జిల్లాకు మీరు కలెక్టర్ అయితే అక్కడ ఉన్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించగలరు అని కూడా అడిగారు.
మీకు అత్యంత కఠినం ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అని భావించిన ప్రశ్న ఏమైనా ఉందా?
జ: ఎలకా్ట్రనిక్స్‌లో కొన్ని అంశాలపైనా, టెక్నాలజీ గురించి కొన్ని డీటెయిల్డ్‌గా చెప్పమన్నారు. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాను. తెలియని అంశంపై సైలెంట్‌గానే ఉన్నా.
అతి సులువు ప్రశ్నగా దేనిని భావించారు?
జ: మీ పేరు ‘వెంకటేష్’ కదా.. ఆ పేరుకున్న అర్థం ఏమిటి అని అడిగారు. పాపాలను హరించేవాడని.. విష్ణు అవతారంలో ఒకరైన శ్రీ వెంకటేశ్వరుని పేరు అది అని చెప్పాను. అయితే విష్ణు అవతారాలలో నాలుగు చెప్పండి అని అడిగితే నాలుగు అవతారాలను చెప్పేశాను.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏవి?
జ: తెలంగాణ గురించి అడగలేదుకానీ.. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన తీరప్రాంతముంది కదా.. ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చు... అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలు.. ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో ఉన్న సమస్యలు గురించి అడిగారు. క్షుణ్నంగా వివరించాను.
తాతపూడి సురే్‌షబాబు, శ్రీకాకుళం
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News