Share News

Land Encroachment: ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:27 AM

గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చూపుతుంటే,

Land Encroachment: ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

గ్రామాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చూపుతుంటే, వాస్తవంలో మాత్రం అందులో సగం భూమి కూడా ఉండడం లేదు. పలువురు వెంచర్లు, ఇతర నిర్మాణాలు చేపడుతూ సమీపంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఆయా భూముల పరిరక్షణకు ప్రభుత్వం తొలుత గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలి. భూ వివరాలు, సరిహద్దులు, ప్రభుత్వ హెచ్చరికలతో కూడిన బోర్డులను ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. ఉపాధిహామీ పనుల ద్వారా ఆ భూముల చుట్టూ కందకాలు తవ్వించాలి. కుంటల్లో పూడిక తీయించాలి. తవ్విన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవచ్చు. ఆయా కుంటల్లో చేపల పెంపకం వంటివి చేపట్టవచ్చు.

– సముద్రాల రామకిషన్‌రావు, జనగామ

Updated Date - Aug 02 , 2025 | 04:27 AM