Mandali: జనం గుండెల్లో నిలిచిన మండలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:32 AM
దివిసీమకి చెందిన రాజకీయ తేజం తెలుగు భాషా సంస్కృతుల వికాసం దశ దిశల వెదజల్లిన కాంతి పుంజం దివంగత మండలి వెంకట కృష్ణారావు...

దివిసీమకి చెందిన రాజకీయ తేజం
తెలుగు భాషా సంస్కృతుల వికాసం
దశ దిశల వెదజల్లిన కాంతి పుంజం
దివంగత మండలి వెంకట కృష్ణారావు
గాంధేయ సిద్ధాంతాలను గాఢంగా నమ్మి
ఖద్దరు దుస్తులను ఖ్యాతిగా ధరియించే
జాతీయ కాంగ్రెస్ పార్టీతో జతకట్టినాక
అవనిలో ఎదిగినాడు ఆంధ్రుల నేతగా...!
ఎంపీ, ఎమ్మెల్యే, విద్యామంత్రి అయ్యాడు
తెలుగు వారందరికీ ప్రేమ ముడి వేశాడు
ధ్వంస సీమను పునర్నిర్మించే.. సంస్థలతో
దివిసీమ గాంధీలా నిలిచాడు కూడలిలో..!
మండలి ఆశయాలే నేటి యువతకు స్ఫూర్తి
శత జయంతి ఉత్సవాలే.. ప్రగతి ప్రజానేతకి
మనం గౌరవంగా ఇచ్చే ఘన నివాళులు..!
జి.సూర్యనారాయణ
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News