Telugu Literature: ధీరజ్ కోట్ల కథా సాహిత్య పురస్కారాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 06:15 AM
ధీరజ్ కోట్ల కథా సాహిత్య పురస్కారాలు ధీరజ్ కోట్ల సాహిత్య పురస్కారాల కోసం 2023, 2024, 2025లలో ప్రచురితమైన కథా సంపుటాలను

ధీరజ్ కోట్ల కథా సాహిత్య పురస్కారాలు ధీరజ్ కోట్ల సాహిత్య పురస్కారాల కోసం 2023, 2024, 2025లలో ప్రచురితమైన కథా సంపుటాలను ఆగస్టు 31 లోగా ఒక కాపీ పంపాలి. మొదటి బహుమతి రూ.10వేలు. అలాగే రూ.1,116 చొప్పున నాలుగు బహుమతులతోపాటు, ఎంపిక కాని పుస్తకాల ధర వెనక్కి చెల్లిస్తాము. చిరునామా: పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, ఇంటి నెం: 15–31, పుట్టంరాజు వారి వీధి, ఇందిరా నగర్, అద్దంకి (పోస్ట్ & మండలం), బాపట్ల జిల్లా – 523201. ఫోన్: 81796 36617. పుట్టంరాజు బుల్లెయ్య
కాశీభట్ల వేణుగోపాల్ స్మరణ సభ అక్షరం లిటరరీ ట్రస్ట్, కర్నూలు తరఫున కాశీభట్ల వేణుగోపాల్ స్మరణ సభ ఆగష్టు 10 ఆదివారం ఉ.10.30కు కెమిస్ట్ భవన్, కర్నూలులో జరుగుతుంది. ఆ సందర్భంగా కాశీభట్ల స్మరణ సంచిక ‘నిహితం’ను వంశీకృష్ణ ఆవిష్కరిస్తారు. అదే సభలో ‘అక్షరం – సాహిత్య పురస్కారం – 2025’ను కవి తెలుగు వెంకటేష్ స్వీకరిస్తారు. జి. వెంకటకృష్ణ
తెలుగు భాషోత్సవాలు నెల్లూరులో తెలుగు భాషోత్సవాలు ‘సేవ’ (తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక సంస్థ) ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాలులో 2025 ఆగస్టు 29, 30, 31 తేదీలలో జరుగనున్నాయి. ఈ సందర్బంగా పాతికేళ్లుగా తెలుగు భాషా సాహితీ రంగాల్లో సేవలందించిన మూడు వందల మంది కవులకు, రచయితలకు సేవ పురస్కారములు అందజేస్తున్నాం. ఈ ఉత్సవాల్లో ప్రాచీన, ఆధునిక, అస్తిత్వవాద సాహిత్యాలు, బాల సాహిత్యం, యువ సాహిత్యం, రాష్ట్రేతర ప్రాంతాల తెలుగు భాషా, సాహిత్యాలు, అవధానం, బోధనా భాషగా తెలుగు, ప్రచురణ, ప్రసార, సాంఘిక మాధ్యమాలు, కథ, నవల, నాటకం సినీ సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనములుంటాయి. వివరాలకు: 94926 66660. కంచర్ల సుబ్బానాయుడు
పద్య కావ్యాలకు ఆహ్వానం రచన సాహిత్య వేదిక (కడప) ఆధ్వర్యంలో గడియారం వేంకట శేషశాస్త్రి అవార్డు కోసం పద్యకావ్యాలకు ఆహ్వానం. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ప్రథమ ముద్రణ పొందిన పద్యకావ్యాలను పంపాలి. ఎంపికైన కావ్యకర్తకు రూ.10వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తాం. కావ్యాలు 3 ప్రతులను ఆగస్ట్ 30లోగా చిరునామా: భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, రచన సాహిత్య వేదిక, 1/2349–1, ‘కృష్ణవేణీ సదన్’, హౌసింగ్‌బోర్డు కాలనీ, కడప – 516004కు పంపాలి. వివరాలకు: 9966624276. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి