Share News

Contract Professors: జీవో 21ను సవరించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:31 AM

ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం జీవో నెంబర్ 21 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ జీవోలోని మార్గదర్శకాలు మాలాంటి కాంట్రాక్టు ప్రొఫెసర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి...

Contract Professors: జీవో 21ను సవరించాలి

ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం జీవో నెంబర్ 21 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ జీవోలోని మార్గదర్శకాలు మాలాంటి కాంట్రాక్టు ప్రొఫెసర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి. మేం ఇన్నేళ్లుగా అరకొర వేతనాలతో, రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమానంగా పనిచేసినప్పటికీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ నియామకాల్లో మా సర్వీసు, బోధనానుభవానికి ఎలాంటి మార్కుల వెయిటేజ్ ఇవ్వలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో, లేదా పరిశోధన సంస్థల్లో పనిచేసిన ప్రొఫెసర్ల బోధనానుభవాన్ని పరిగణలోకి తీసుకుని సంవత్సరానికి ఒకటి చొప్పున గరిష్ఠంగా పది మార్కులను కేటాయించారు. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల నియామకాల్లో బోధన, పరిశోధన అనుభవానికి సమానంగా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్‌కు ఇచ్చినట్టు స్థానిక వర్సిటీలకు సంబంధించిన ఈ జీవోలో ఎలాంటి మార్కుల వెయిటేజ్ కల్పించలేదు. ఏదైనా విద్యా సంస్థల నుంచి సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ కలిగి ఉండి, ఆయా విభాగాల్లో కనీసం పదేళ్లు విశేష కృషి చేసిన ప్రొఫెషనల్స్‌ను ప్రొఫెసర్లుగా నియమించుకోవచ్చని యూజీసీ 2018 నియామక మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. కానీ ఈ జీవో 21లో కాంట్రాక్టు ప్రొఫెసర్లకు అలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం.


రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అనుభవజ్ఞులను అందులో ప్రొఫెసర్లుగా ప్రభుత్వం నియమించుకోవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి 21 జీవోను సవరించాలి. లేదా కాంట్రాక్టు ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో ప్రభుత్వం ముందుకెళ్లాలి.

డా. కే. రామస్వామి,

జర్నలిజం విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ

ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 07:07 AM