Spiritual:సాయంత్రం వేళ ఈ వస్తువులు దానం చేయవద్దు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 09:59 AM
లక్ష్మీ దేవి ఆశీస్సులు తమపై, తమ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అందుకు తగిన విధంగా పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం అశుభకరమైనదిగా భావిస్తారు. పొరపాటున కూడా సాయంత్రం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

Spiritual: సాయంత్రం (Evening) లేదా సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. అలాగే, కొన్ని వస్తువులను దానం చేయకూడదని, అది మంచిది కాదనే నమ్మకం ఉంది. కాబట్టి, సాయంత్రం వేళల్లో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకుందాం.. సాయంత్రం లేదా సంధ్యా సమయంలో తెల్లటి వస్తువులను (White Items) దానం (Donation) చేయకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే తెల్లని వస్తువులు లక్ష్మీ దేవి (Lakshmi Devi)కి ప్రియమైనవని నమ్ముతారు. కాబట్టి, పాలు (Milk), పెరుగు (Yogurt), ఉప్పు (Salt) మొదలైన వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు.
Also Read..: భోజనం చివరిలో పెరుగు ఎందుకు తినాలంటే..
ఈ వస్తులు దానం చేయొద్దు..
సాయంత్రం వేళ అనుకోకుండా ఎవరు వచ్చి అడిగినా ఈ వస్తువులను దానం చేయవద్దు.. పాలు, పెరుగు, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సూది వంటివి ఎవరికీ ఇవ్వవద్దు.. అదే సమయంలో ఎవరి దగ్గర తీసుకోకూడదు. సాయంత్రం వేళ వీటిని ఇవ్వడం తీసుకోవడం అశుభమని పెద్దలు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. దీని అర్థం ఏంటంటే ఈ సమయంలో ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదని.. లేదా అప్పుగా తీసుకోకూడదని... ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.
సాయంత్రం వేళ నిద్ర..
సనాతన విశ్వాసాల ప్రకారం సాయంత్రం నిద్రించడం అంటే సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి తల్లి అర్ఘ్యం సమర్పిస్తుందని.. దేవతలు ఆకాశంలో విహరిస్తారని.. ఆశీర్వాదం ఇస్తారని నమ్మకం. ఈ సమయంలో నిద్రిస్తే.. దేవతల అనుగ్రహం కోల్పోతారని నమ్ముతారు. అలాగే సాయంత్రం నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు..
హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మిదేవి స్వరూపంగా భావిస్తారు. సాయంత్రం వేళ తులసికి నీరు పోయడం, తులసిని తాకడం వంటివి చేయకూడదు.. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
ఇంటిని శుభ్రం చేయవద్దు..
సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం, తుడుచుకోవడం వంటి పనులు చేయకూడదు.. అశుభంగా భావిస్తారు. ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీ దేవి అసంతృప్తికి గురౌతుందని .. ఆ ఇంట్లో పేదరికాన్ని తెస్తుందని చెబుతారు.
ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి..
సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి... ఆ సమయంలో ఇంట్లో దేవుని గదిలో దీపం పెట్టి ప్రధాన ద్వారా తెరిచి ఉంచితే.. హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యానికి దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి సంతోషంగా ఉంటే డబ్బుకు లోటు ఉండదని, ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. అయితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే ఆ ఇంట్లో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఆ ఇంట్లో ఆర్ధిక బాధలతో, పేదరికంతో ఇబ్బంది పడతారని నమ్మకం. అందువల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పూజలు కూడా చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన
NTR వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు పునఃప్రారంభం
For More AP News and Telugu News