Share News

Pooja Tips: ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను పూజించడానికి ఉపయోగించవచ్చా..

ABN , Publish Date - Jun 01 , 2025 | 05:19 PM

చాలా మంది పువ్వులు పాడవకుండా ఉండటానికి ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే, అలా ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Pooja Tips: ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను పూజించడానికి ఉపయోగించవచ్చా..
Flowers

పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. త్వరగా వాడిపోతాయి. అందుకని చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఎందుకంటే, అందులో ఉంచడం వల్ల పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే, అలా ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


మనం సాధారణంగా పూజ కోసం పూలను ఇంటి మొక్కల నుండి లేదా మార్కెట్ నుండి తెస్తాము. అయితే, ఈ పువ్వులను ఎంతకాలం ఉంచి పూజించాలి? అంతేకాకుండా, ఫ్రిజ్‌లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? అని చాాలా మంది గందరగోళంలో ఉంటారు.

ఉపయోగించకూడదు

ఫ్రిజ్‌లో ఉంచిన పూలను పూజకు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, అలాంటి పూలతో దేవుడిని పూజిస్తే ఫలితాలు ఉండవని అంటున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన పూలను కేవలం వివాహ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కానీ పూజకు ఉపయోగించకూడదంటున్నారు.

మార్కెట్ నుండి తెచ్చిన పూలను.. ఇంట్లో తెల్లటి వస్త్రంలో ఉంచి ఆ పువ్వులపై నీళ్లు చల్లితే అవి స్వచ్ఛంగా ఉంటాయని, ఈ విధంగా ఉంచిన పువ్వులను మూడు రోజులు దేవుడి పూజకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.


Also Read:

ఇలాంటి కోడలు ఉంటే ఇల్లు నరకమే..

భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో తెలుసా

For More Lifestyle News

Updated Date - Jun 01 , 2025 | 05:33 PM