Youth Slits Friends Throat: తల్లితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో ఫ్రెండ్‌ను..
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:18 PM
ఆశిష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంజిత్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారింది. ఆశిష్‌ను చంపడానికి పూనుకున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తన తల్లితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి స్నేహితుడ్ని చంపేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. అనంతరం కసి తీరా రాయితో కొట్టి స్నేహితుడి తలను పచ్చడి చేశాడు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆశిష్ అనే వ్యక్తి భోపాల్‌లోని శ్యామ్ నగర్లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రంజిత్ సింగ్‌తో అతడికి చాలా ఏళ్లనుంచి స్నేహం ఉంది.
ఆ స్నేహం ఓ అనుమానం కారణంగా శత్రుత్వంగా మారింది. ఆశిష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంజిత్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారింది. ఆశిష్‌ను చంపడానికి పూనుకున్నాడు. ఇందుకోసం ఆశిష్‌తో శత్రుత్వం ఉన్న వినయ్ యాదవ్, నిఖిల్ యాదవ్‌ల సాయం తీసుకున్నాడు. గురువారం రోజు రంజిత్, ఆశిష్‌ల మధ్య గొడవ జరిగింది. ఇకపై తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని రంజిత్ వార్నింగ్ ఇచ్చాడు. రంజిత్ వార్నింగ్‌ను ఆశిష్ పెడచెవిన పెట్టాడు.
ఆశిష్ శనివారం తెల్లవారుజామున మళ్లీ రంజిత్ ఇంటి దగ్గర కనిపించాడు. దీంతో రంజిత్, వినయ్, నిఖిల్‌లు పదునైన ఆయుధాలతో ఆశిష్‌పై దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. రంజిత్ అంతటితో ఆగకుండా ఆశిష్ తలను బండరాయితో కొట్టి నుజ్జునుజ్జు చేశాడు. అనంతరం అక్కడినుంచి ముగ్గురూ పరారయ్యారు. ఈ హత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బుధవారం నుంచి ఏపీలో భారీ వర్షాలు..
మనవరాళ్లతో కలిసి మార్కెట్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్.. వైరల్ వీడియో