Share News

West Godavari: భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:51 PM

Young Man Love: హేమంత్‌కు మూడు నెలల క్రితమే పెళ్లి చేశారు. అయితే, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అతడికి నాగమణి మీద ఇష్టం చావలేదు. పెళ్లి చేసుకోవాలంటూ గత కొద్దిరోజుల నుంచి ఆమెపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు.

West Godavari: భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు
Young Man Love

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి పేరుతో ఓ యువకుడు వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు కాకుండా పోతోందన్న కోపంతో ఆమె గొంతు కోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళ ఆస్పత్రి పాలైంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన హేమంత్, అదే ప్రాంతానికి చెందిన నాగమణి అనే మహిళ నాలుగు నెలల క్రితం సన్నిహితంగా ఉండేవారు. వీరి విషయం హేమంత్ ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది.


దీంతో హేమంత్‌కు మూడు నెలల క్రితమే పెళ్లి చేశారు. అయితే, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అతడికి నాగమణి మీద ఇష్టం చావలేదు. పెళ్లి చేసుకోవాలంటూ గత కొద్దిరోజుల నుంచి ఆమెపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఆమె కుదరదని చెప్పినా వినటం లేదు. పదేపదే పెళ్లి పేరుతో పేరుతో వేధిస్తూ ఉన్నాడు. ఈసారి నాగమణి పెళ్లి చేసుకోవటం కుదరదని గట్టిగా చెప్పింది. హేమంత్ తట్టుకోలేకపోయాడు. తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని భావించాడు. బుధవారం ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు.


నాగమణి గొంతు కోసేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ నాగమణిని ఆస్పత్రికి తరలించారు. నాగమణి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

అంతరిక్షంలోకి శుభాంశు..మొదటి సందేశం ఇదే..

సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న మహిళలు.. ఇంతలోనే అనుకోని విషాదం..

Updated Date - Jun 25 , 2025 | 04:51 PM