Share News

Tragic End: కొడుకును ఆడపిల్లలా అలంకరించి.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ABN , Publish Date - Jul 03 , 2025 | 08:13 AM

Tragic End: తమ్ముడు, తల్లితో శివ్‌లాల్‌కు ఆస్థి తగాదాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద తనకంటూ ఓ ఇళ్లు నిర్మించుకోవాలని శివ్‌లాల్ అనుకున్నాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు.

Tragic End: కొడుకును ఆడపిల్లలా అలంకరించి.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Tragic End

ఆ తల్లి తన చిన్న కొడుకును ఆడ పిల్లలా అందంగా ముస్తాబు చేసింది. కళ్లకు కాటుక పెట్టింది.. తలపై దుపట్టా వేసింది.. తన బంగారు నగల్ని అతడికి అలంకరించి మురిసిపోయింది. కొడుకును ఆడపిల్లల్లా ముస్తాబు చేసిన అనంతరం వీడియో తీసింది. ఆ తర్వాత మనసున్న సగటు మనిషికి కన్నీళ్లు తెప్పించే సంఘటన జరిగింది. ఆ మహిళ కుటుంబం మొత్తం ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు నీటిలో దూకి చనిపోయారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్, బర్మర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్, బర్మర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివ్‌లాల్ మెఘ్‌వాల్, 32 ఏళ్ల కవిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ కొడుకులే. ఓ అబ్బాయి పేరు బజ్‌రంగ్.. వయసు 9 సంవత్సరాలు. మరో అబ్బాయి పేరు రామ్ దేవ్.. వయసు 8 సంవత్సరాలు. తమ్ముడు, తల్లితో శివ్‌లాల్‌కు ఆస్థి తగాదాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద తనకంటూ ఓ ఇళ్లు నిర్మించుకోవాలని శివ్‌లాల్ అనుకున్నాడు.


ఇందుకు తల్లి, తమ్ముడు ఒప్పుకోలేదు. ఈ విషయంలో గత కొద్దిరోజులనుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణంగా శివ్‌లాల్, కవిత వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆ వేధింపులు తారాస్థాయికి చేరటంతో ఇద్దరూ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం కవిత తన చిన్న కొడుకును ఆడపిల్లలా ముస్తాబు చేసి మురిసిపోయింది. తర్వాత అందరూ కలిసి ఇంటి దగ్గరలో ఉన్న నీటి కుంటలో దూకి చనిపోయారు.


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం దగ్గర పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది. ఆ నోట్ ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు

అపురూప దృశ్యం.. శివుడికి అభిషేకం చేసిన గంగమ్మ

Updated Date - Jul 03 , 2025 | 08:45 AM