Woman Cop Lover: తల్లి గురించి తప్పుగా మాట్లాడిందని పోలీస్ ప్రియురాలిని..
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:54 AM
Woman Cop Lover: ఓ వైపు ప్రేమ, మరో వైపు ఉద్యోగం ఇద్దరూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. ఇంతలోనే దారుణం జరిగింది.

తల్లిని తిట్టిందన్న కోపంతో ఏఎస్ఐగా పని చేస్తున్న ప్రియురాలిని చంపేశాడు ఓ జవాన్. తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన గుజరాత్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కుచ్ జిల్లాకు చెందిన అరుణబెన్ నాటుభాయ్ జాదవ్‌కు 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అదే ప్రాంతానికి చెందిన దిలీప్ దంగ్చియతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇక, అప్పటినుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
సహజీవనం మొదలెట్టిన కొంతకాలానికి అరుణకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా.. దిలీప్‌కు సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఓ వైపు ప్రేమ, మరో వైపు ఉద్యోగం ఇద్దరూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. ఇంతలోనే దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి అరుణకు, దీలీప్‌కు మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఈ నేపథ్యంలోనే అరుణ, దిలీప్ తల్లిని దారుణంగా తిట్టింది. అతడు తట్టుకోలేకపోయాడు.
క్షణికావేశంలో అరుణ గొంతు పిసికి చంపేశాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ చౌదరి మాట్లాడుతూ.. ‘తన తల్లి గురించి అరుణ తప్పుగా మాట్లాడటంతో దిలీప్ తట్టుకోలేకపోయాడు. అరుణ గొంతు నులిమి చంపేశాడు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సోనూసూద్ సాహసం.. ఒంటి చేత్తో పామును పట్టి..
మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..