Share News

Man Buries Wife: భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటాడు.. 9 నెలల తర్వాత..

ABN , Publish Date - Jul 14 , 2025 | 09:31 AM

Man Buries Wifes: మధ్యాహ్నం రామ్‌వతి కొడుకు అభిలాష్ మజి పొలం దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి కనిపించలేదు. తల్లి గురించి తన సోదరిని అడిగాడు. తల్లి ప్రయాగ్‌రాజ్ వెళ్లిందని ఆమె చెప్పింది. సాయంత్రం అయినా తల్లి ఇంటికి రాకపోవటంతో అభిలాష్ మజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Man Buries Wife: భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటాడు.. 9 నెలల తర్వాత..
Man Buries Wifes

నేరస్తులు తెలివి మీరి పోతున్నారు. నేరాలు చేసి, తప్పించుకోగలం అన్న ధీమాతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా, ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. హత్య నుంచి తప్పించుకోవడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య శవాన్ని పొలంలో పూడ్చి పెట్టి.. వాటిపై కూరగాయలు నాటాడు. తర్వాత ఊరు విడిచిపారిపోయాడు. 9 నెలల పాటు ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న దేవ్‌ముని మజి, రామ్‌వతి భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. జైల్ రోడ్డులోని పొలంలో దేవ్‌ముని కూరగాయలు పండించేవాడు. ఇందుకు భార్య, కూతురు సాయం చేసేవారు. 2024, అక్టోబర్ 11వ తేదీన దేవ్‌ముని తన భార్యను చంపేశాడు. ఆమె నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని పొలంలో పూడ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దానిపై కూరగాయల మొక్కలు నాటాడు.


మధ్యాహ్నం రామ్‌వతి కొడుకు అభిలాష్ మజి పొలం దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి కనిపించలేదు. తల్లి గురించి తన సోదరిని అడిగాడు. తల్లి ప్రయాగ్‌రాజ్ వెళ్లిందని ఆమె చెప్పింది. సాయంత్రం అయినా తల్లి ఇంటికి రాకపోవటంతో అభిలాష్ మజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు కేసు నేపథ్యంలో దేవ్‌ముని కూతుర్ని తీసుకుని ఊరు విడిచిపారిపోయాడు. దేవ్‌ముని తన భార్యను పొలంలో పూడ్చాడని పోలీసులు కనుగొన్నారు. పొలంలోని రామ్‌వతి మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న దేవ్‌ముని కోసం గాలింపు చేపట్టారు. తాజాగా, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.


ఇవి కూడా చదవండి

ఏడేళ్ల తర్వాత కీలక నిర్ణయం.. భర్తతో సైనా విడాకులు

విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే..

Updated Date - Jul 14 , 2025 | 09:47 AM