Share News

Witchcraft Suspicion: క్షుద్ర పూజలు చేస్తున్నాడని వ్యక్తిని చంపి.. అతడి ప్రైవేట్ పార్ట్‌ను..

ABN , Publish Date - Aug 04 , 2025 | 10:35 AM

Witchcraft Suspicion: గోపాల్ ఊరికి వెళ్లడానికి ఒక రోజు ముందు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి చావుకు కారణం గోపాల్ చేసే క్షుద్రపూజలే అని కొందరు గ్రామస్తులు భావించారు.

Witchcraft Suspicion: క్షుద్ర పూజలు చేస్తున్నాడని వ్యక్తిని చంపి.. అతడి ప్రైవేట్ పార్ట్‌ను..
Witchcraft Suspicion

శాస్త్ర సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు జనాల్ని వీడటం లేదు. కొందరు మంత్రాలు, క్షుద్రపూజల పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ఒడిశాలో ఓ భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. అనంతరం అతడి ప్రైవేట్ పార్టును శరీరం నుంచి వేరు చేశారు. శవాన్ని డ్యామ్‌లో పడేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బెహ్రామ్‌పుర్ జిల్లా మలసపదర్ గ్రామానికి చెందిన గోపాల్ కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి గంజాం జిల్లాలోని అత్తింటికి వెళ్లాడు. వెళ్లే ముందు పశువుల్ని వదినకు అప్పజెప్పాడు. శనివారం అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, అతడు ఊరికి వెళ్లడానికి ఒక రోజు ముందు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి చావుకు కారణం గోపాల్ చేసే క్షుద్రపూజలే అని కొందరు గ్రామస్తులు భావించారు. ఈ నేపథ్యంలోనే గోపాల్‌ను చంపాలని డిసైడ్ అయ్యారు.


శనివారం అతడు ఇంటికి తిరిగిరాగానే పశువుల్ని తెచ్చుకోవడానికి వెళ్లాడు. ఈ సమయంలో 20 మంది కలిసి గోపాల్‌ను అడ్డగించి కొట్టి చంపేశారు. తర్వాత అతడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేశారు. శవాన్ని హరబంగీ డ్యామ్‌లో పడేశారు. హత్య గురించిన సమాచారం అందుకున్న పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం డ్యాములో పడేసిన శవాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ

మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

Updated Date - Aug 04 , 2025 | 11:49 AM