Banana Grove: భార్య,అత్తను చంపి అరటి చెట్టుకింద పూడ్చిన యువకుడు
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:05 PM
Banana Grove: సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు.

భార్యాభర్తల మధ్య గొడవలు దారుణాలకు తెరతీస్తున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరినపుడు విడిపోయి సంతోషంగా బతకటం నేర్చుకోవాలన్న ఆలోచన లేకుండా హత్యలు చేసేస్తున్నారు కొందరు. తాజాగా, ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య, అత్తను చంపేశాడు. నిద్రపోతున్న వారిని బండరాయితో కొట్టి ప్రాణం తీశాడు. తర్వాత రెండు శవాలను అరటి చెట్టుకింద పాతేశాడు. ఈ సంఘటన ఒరిస్సాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
మయుర్‌భంజ్‌కు చెందిన దెబసిస్ పాత్ర, సోనాలి దలాల్‌లకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన మొదటి నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం సోనాలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక, అప్పటినుంచి అక్కడే ఉంటోంది. సోనాలి తల్లిదండ్రులు కూతుర్ని భర్తతో కలపడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. జులై 12వ తేదీన సోనాలి తల్లి సుమతి దలాల్ .. సోనాలిని భర్త దగ్గరకు తీసుకు వచ్చింది.
తిరిగి వచ్చిన తర్వాత కూడా గొడవలు ఆగలేదు. దీంతో సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు. తర్వాత రెండు శవాలను అరటి చెట్టు కింద గొయ్యి తీసి పూడ్చేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య, అత్త కనిపించటం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవ్వరికీ అతడిపై అనుమానం రాలేదు.
అతడు కొన్ని రోజులు కాలర్ ఎగరేసుకు తిరిగాడు. అయితే, నిమ్మ తోటలో భూమి తవ్వినట్లు ఉండటం.. కొత్త అరటి చెట్లు నాటి ఉండటం చూసి గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు పాత్రను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన మర్డర్ల గురించి బయటపెట్టాడు. పోలీసులు అరటి చెట్టు కింద ఉన్న శవాలను బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి
కొత్త రూల్.. ఇకపై హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టరు..
అమానుషం.. చిన్న పిల్లల్ని తగలబెట్టిన దుండగులు..