Share News

Madhyapradesh: భర్తను చంపిన మైనర్ బాలిక.. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్

ABN , Publish Date - Apr 18 , 2025 | 09:37 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను అంతమొందించింది. ఇష్టారీతిన అతడు మరణించే వరకూ పొడిచి ఆపై ప్రియుడికి ఫోన్ చేసిన పని అయిపోయిందని చెప్పింది.

Madhyapradesh: భర్తను చంపిన మైనర్ బాలిక.. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్
Madhyapradesh

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌ వేని భర్తను మట్టుపెట్టింది. ఆ తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసిన పని అయిపోయిందని చెప్పింది. బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్ -ఇఛాపూర్ రోడ్డు పక్కన పొదల మాటున ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుడిని రాహుల్‌గా గుర్తించారు. అతడి మృతదేహంపై తీవ్ర గాయాలు కనిపించాయి. అయితే, మృతుడి భార్య కూడా కొన్ని రోజులుగా జాడ లేకుండా పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు యువరాజ్‌తో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన దారుణం బయటపడింది. నిందితురాలితో కలిసి తాను ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు యువరాజ్ తెలిపాడు.


ఘటన రోజు, నిందితురాలు భర్త రాహుల్‌ను షాపింగ్ కోసం బయటకు తీసుకెళ్లింది. షాపింగ్ ముగించుకుని బయలుదేరిన వారు మార్గమధ్యంలో ఓ హోటల్‌లో భోజనం చేశారు. ఆ తరువాత మళ్లీ బయలుదేరగా ఓ చోట ఆమె భర్తను వాహనం ఆప మని చెప్పింది. చెప్పు జారిపోయిందని చెప్పి నాటకం మొదలెట్టింది. అప్పటికే ఆ జంటను యువరాజ్ స్నేహితుడు లలిత్, మరో మైనర్ బాలుడు ముందుస్తు ప్లాన్ ప్రకారం అనుసరిస్తూ వచ్చారు.


రాహుల్ వాహనం దిగగానే వారిద్దరూ అతడిని పొదల్లోకి పడదోశారు. ఆ తరువాత నిందితురాలు భర్తను ఓ బీర్ బాటిల్‌తో గట్టిగా తలపై కొట్టింది. మైనర్ బాలుడు రాహుల్‌తో పదునైన వస్తువుతో పొడిచాడు. లలిత్ కూడా కూడా అతడిని పలుమార్లు పొడిచాడు. దీంతో, తీవ్ర గాయాల పాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చివరకు యువరాజ్‌కు వీడియో కాల్ చేసిన మైనర్ బాలిక పని అయిపోయిందని చెప్పింది. ఆ తరువాత నిందితులు ముగ్గురూ రైల్లో ఉజ్జెయిన్‌కు వెళ్లిపోయారు. మొబైల్ ఫోన్ కదలికల ఆధారంగా నిందితుల జాడ కనుక్కు్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Crime News

Updated Date - Apr 18 , 2025 | 09:37 PM