Techie Kavin Selvaganesh: ఫలించని పోరాటం.. వారం రోజుల తర్వాత ఇంటికి కవిన్ బాడీ..
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:47 PM
Techie Kavin Selvaganesh: తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఇద్దరూ ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మర్డర్ నేపథ్యంలో ఇద్దరినీ ఉద్యోగాలనుంచి సస్పెండ్ చేశారు. సుర్జిత్‌తో పాటు అతడి తండ్రి శరవణన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులో కవిన్ సెల్వ గణేష్ పరువు హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కతో చనువుగా ఉంటున్నాడన్న కోపంతో తిరునల్వేలికి చెందిన సుర్జిత్ అతి క్రూరంగా కవిన్‌ను నరికి చంపాడు. జులై 23వ తేదీన ఈ హత్య జరిగింది. ఇన్ని రోజుల పాటు కవిన్ బాడీని తీసుకోవడానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. నిందితుడి తల్లిని అరెస్ట్ చేసే వరకు బాడీని తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. నిందితుడు సుర్జిత్ తల్లిదండ్రులు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు.
తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఇద్దరూ ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మర్డర్ నేపథ్యంలో ఇద్దరినీ ఉద్యోగాలనుంచి సస్పెండ్ చేశారు. సుర్జిత్‌తో పాటు అతడి తండ్రి శరవణన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కృష్ణకుమారిని సస్పెండ్ మాత్రమే చేశారు. అరెస్ట్ చేయలేదు. దీంతో కవిన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమెను కూడా అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తోంది. కృష్ణకుమారిని అరెస్ట్ చేసే వరకు కవిన్ బాడీని తీసుకునేది లేదని అంది.
అయితే, వారం రోజుల తర్వాత కవిన్ కుటుంబం వెనక్కు తగ్గింది. కవిన్ బాడీని తీసుకుంది. అంత్యక్రియల కోసం సొంతూరు తూత్తుకుడికి తరలించింది. కాగా, ఈ కేసులో ఓ ట్విస్ట్ వెలుగుచూసింది. కవిన్ హత్యకు కారణమైన అమ్మాయి ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో..‘నేను, కవిన్ ప్రేమించుకుంటున్న మాట నిజమే. నేను మా అమ్మానాన్నలకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మా రిలేషన్ గురించి వారికి అస్సలు తెలియదు. వారికి ఈ మర్డర్‌తో ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
దూడను నోట కరుచుకున్న చిరుత.. ఆవును చూసి పరుగోపరుగు..
సైబర్ ముఠా చేతుల్లో తెలుగు యువకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి