Share News

Bombay Scottish Teacher: అరెస్టైనా అదే మాట.. స్టూడెంట్‌ని ప్రేమిస్తున్నానన్న టీచర్

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:01 PM

Bombay Scottish Teacher: పరీక్షలు అయిపోయిన తర్వాత బిపాసా అతడ్ని కాంటాక్ట్ అయింది. అతడు మాత్రం ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఇద్దరూ కలుసుకోలేదు.

Bombay Scottish Teacher: అరెస్టైనా అదే మాట.. స్టూడెంట్‌ని ప్రేమిస్తున్నానన్న టీచర్
Bombay Scottish Teacher

12వ తరగతి విద్యార్థిని లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో బాంబే స్కాటిష్ హైస్కూలుకు చెందిన బిపాసా కుమార్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పోలీసు కస్టడీలో ఉంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిపాసా పోలీసుల విచారణలో ఏం చెప్పిందంటే.. ‘నేను ఇంకా ఆ విద్యార్థిని ప్రేమిస్తున్నాను. అతడిపై ప్రేమ చావలేదు కాబట్టే.. ఇంటి పని మనిషిని రాయబారానికి పంపాను.


బ్రేకప్ తర్వాత నేను తట్టుకోలేకపోయాను. అందుకే అతడితో మళ్లీ కలవడానికి ప్రయత్నించాను’ అని స్పష్టం చేసింది. కాగా, నాలుగు నెలల క్రితం బిపాసా మాయమాటలు చెప్పి ఆ విద్యార్థిని లైంగికంగా వేధించసాగింది. ఖరీదైన బట్టలు, హోటళ్లలో భోజనాలు చేయించేది. ఎలా డ్రెస్ వేసుకోవాలో కూడా ఆమే చెప్పేది. ఫిబ్రవరి నెలలో ఇద్దరి బంధానికి బ్రేక్ పడింది. పరీక్షలు ఉండటంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగింది.


పరీక్షలు అయిపోయిన తర్వాత బిపాసా అతడ్ని కాంటాక్ట్ అయింది. అతడు మాత్రం ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఇద్దరూ కలుసుకోలేదు. నాలుగు నెలల తర్వాత ఆమె తన ఇంటి పని మనిషిని అతడి ఇంటికి పంపింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా రిలేషన్ విద్యార్థి ఇంట్లో వాళ్లకు తెలిసింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో బిపాసాను అరెస్ట్ చేశారు. బిపాసాకు ఓ లేడీ డాక్టర్ సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ డాక్టర్ ఆ విద్యార్థికి ఒత్తిడి తగ్గే మాత్రలు రాసిచ్చినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు

మొసలిని పెళ్లాడిన మేయర్.. కారణం ఏంటంటే..

Updated Date - Jul 03 , 2025 | 01:05 PM