Share News

విమ్టా ల్యాబ్స్‌ 1:1 బోనస్‌ ఇష్యూ

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:33 AM

విమ్టా ల్యాబ్స్‌.. వాటాదారులకు 1ః1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అర్హులైన వాటాదారులందరికి రూ.2 ముఖ విలువతో కూడిన...

విమ్టా ల్యాబ్స్‌ 1:1 బోనస్‌ ఇష్యూ

క్యూ4 లాభం రూ.18 కోట్లు

బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ ఆర్‌ అండ్‌ డీలోకి అడుగు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విమ్టా ల్యాబ్స్‌.. వాటాదారులకు 1ః1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అర్హులైన వాటాదారులందరికి రూ.2 ముఖ విలువతో కూడిన ప్రతి షేరుకు ఒక షేరును జారీ చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారుల అనుమతికి లోబడి ఈ షేర్ల జారీ ఉంటుందని తెలిపింది. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ రూ.96.1 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.18.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.348.20 కోట్ల ఆదాయంపై రూ.66.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.2 ముఖ విలువతో కూడిన ప్రతి షేరుకు రూ.2 తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. కాగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ రీసె ర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ)లోకి అడుగు పెడుతున్నట్లు విమ్టా ల్యాబ్స్‌ ప్రకటించింది. నోవెల్‌ బయోలాజిక్‌ ఎంటైటీస్‌, బయోసిమిలర్స్‌, పెప్టైడ్‌ ఆధారిత థెరాప్యుటిక్స్‌పై ఈ విభాగం దృష్టి పెడుతుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 29 , 2025 | 04:33 AM