Share News

యూకో బ్యాంక్‌ లాభంలో 24@ వృద్ధి

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:41 AM

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.665.72 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం...

యూకో బ్యాంక్‌ లాభంలో 24@ వృద్ధి

క్యూ4లో రూ.666 కోట్లు

కోల్‌కతా: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌ మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.665.72 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.537.86 కోట్ల లాభంతో పోల్చితే ఇది 24 శాతం అధికం. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.6,984 కోట్ల నుంచి రూ.8,136 కోట్లకు పెరిగింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కన్సాలిడేటెడ్‌ లాభం రూ.1,671 కోట్ల నుంచి రూ.2,468 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్‌ ప్రకటించింది. మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 3.46ు నుంచి 2.69 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.89ు నుంచి 0.50 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి 96.69 శాతంగా ఉంది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ మొత్తం వ్యాపారం 14.12ు పెరిగి రూ.5,13,527 కోట్లకు చేరింది. రుణాలు 17.72ు వృద్ధితో రూ.2,19,985 కోట్లకు చేరగా డిపాజిట్లు 11.56ు వృద్ధితో రూ.2,93,542 కోట్లుగా నమోదయ్యాయి. రిటైల్‌, వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈ విభాగంలో రుణాలు 25.74ు వృద్ధితో రూ.1,22,613 కోట్లకు చేరాయి.


75 శాతానికి ప్రభుత్వ వాటా తగ్గింపుపై కసరత్తు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 270 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేయాలని యూకో బ్యాంక్‌ ప్రణాళికలు రచిస్తోంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో ప్రభుత్వ వాటా 75 శాతానికి తగ్గించుకునేందుకు ఈ తాజా ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నట్టు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశ్వనీ కుమార్‌ తెలిపారు. ప్రస్తుత బ్యాంక్‌ షేరు విలువ రూ.31ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఇష్యూ సైజు రూ.8,000 కోట్లుగా ఉండనుంది. మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌.. క్యూఐపీ విధానంలో రూ.2,000 కోట్లు సమీకరించింది. దీంతో ప్రభుత్వ వాటా 95.39 శాతం నుంచి 90.95 శాతానికి దిగివచ్చింది.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 29 , 2025 | 04:41 AM