Share News

Tata Motors Patents 2025: పేటెంట్లలో టాటా మోటార్స్‌ రికార్డు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:25 AM

టాటా మోటార్స్‌ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 250 పేటెంట్లు, 148 డిజైన్‌ అప్లికేషన్లు, 81 కాపీరైట్‌ అప్లికేషన్లను దాఖలు చేసినట్టు ప్రకటించింది. ఈ ఏడాది 68 పేటెంట్లు మంజూరవడంతో మొత్తం పేటెంట్ల సంఖ్య 918కు చేరింది

Tata Motors Patents 2025: పేటెంట్లలో టాటా మోటార్స్‌ రికార్డు

ముంబై: ఇటీవల ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో 250 పేటెంట్లు, 148 డిజైన్‌ అప్లికేషన్లు, 81 కాపీరైట్‌ అప్లికేషన్లు దాఖలు చేసినట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పేటెంట్లు, అప్లికేషన్ల దాఖలులో ఇది కొత్త రికార్డు అని పేర్కొంది. అలాగే ఈ ఏడాదిలో తమకు 68 పేటెంట్లు మంజూరు కావడంతో తాము పొందిన మొత్తం పేటెంట్ల సంఖ్య 918కి చేరిందని తెలిపింది.

Updated Date - Apr 18 , 2025 | 01:25 AM