Stock Market Wednesday Closing: రోజు గరిష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:23 PM
ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఇవాళ్టి సెషన్‌ను రోజు గరిష్ట స్థాయిలో ముగించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా వరుసగా మూడవ రోజు లాభాలను నమోదు చేశాయి. దలాల్ స్ట్రీట్‌లో బ్యాంకులు ముందంజలో ఉన్నాయి.

Stock Market Wednesday Closing: ఇవాళ (బుధవారం) భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్లు.. నిమిషాల వ్యవధిలోనే కోలుకొని బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 309.40 పాయింట్లు (0.40 శాతం) లాభంతో.. 77,044.29 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్ల(0.47శాతం) లాభంతో.. 23,437.20 పాయింట్ల వద్ద నిలిచాయి. నిఫ్టీ ఇవాళ రెండు వారాల గరిష్ట స్థాయిని తాకడం మరో విశేషం.
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 738.25 పాయింట్లు(1.41 శాతం) పెరిగి 53,117.75 వద్ద, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 371 పాయింట్లు పెరిగి 52,345 వద్ద స్థిరపడటంతో మార్కెట్ సెంటిమెంట్ ఉత్సాహంగా ఉంది. ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఇవాళ్టి సెషన్‌ను రోజు గరిష్ట స్థాయిలో ముగించడం మరో ఆసక్తికర అంశం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగం షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా వరుసగా మూడవ రోజు లాభాలను నమోదు చేశాయి. దలాల్ స్ట్రీట్‌లో బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ 4-5% ర్యాలీ తీసి మిడ్‌క్యాప్ సూచీలను ముందుకు తీసుకెళ్లాయి.
నిన్న భారత స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అదే ఊపును మార్కెట్లు ఇవాళ వరుసగా మూడో రోజు కొనసాగించడం విశేషం. నిన్న మంగళవారం సెన్సెక్స్ 1,671.65 పాయింట్లు లేదా 2.22 శాతం లాభంతో.. నిఫ్టీ 513.45 పాయింట్లు లేదా 2.25 శాతం లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News