Share News

Stock Market Volatility: ఆటుపోట్లు తప్పవు

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:57 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం తక్కువే అయినప్పటికీ మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు...

Stock Market Volatility: ఆటుపోట్లు తప్పవు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం తక్కువే అయినప్పటికీ మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. పైగా అమెరికాలో నిరుద్యోగ డేటా, ద్రవ్యోల్బణం వంటివి ప్రతికూలంగా మారాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలు స్వల్ప, మధ్యకాలంలో బలహీనతను సూచిస్తున్నాయి. మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

హ్యుండయ్‌ మోటార్స్‌: తాజా గరిష్ఠం తర్వాత ఈ షేరు పుల్‌బ్యాక్‌ అయ్యింది. 20 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌ వద్ద మద్దతు తీసుకున్నాయి. తాజా ఆర్థిక ఫలితాలు, డివిడెండ్‌తో ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. మూమెంటమ్‌ బాగుంది. గత శుక్రవారం రూ.2,181 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,150 శ్రేణిలో ప్రవేశించి రూ.2,280 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.2,120 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

జిందాల్‌ స్టెయిన్‌లె్‌స స్టీల్‌: మార్చిలో ట్రెండ్‌ రివర్సల్‌ అయిన తర్వాత ఈ షేరు ప్రస్తుతం ఎగువ స్థాయిలో సైడ్‌వే్‌సలో చలిస్తోంది. నష్టాల మార్కెట్లోనూ బలం ప్రదర్శిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. మీడియం, షార్ట్‌టర్మ్‌ మూమెంటమ్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.706 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.680 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.770/800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.650 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఇమామీ: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. డెలివరీ పరిమాణం పెరుగుతోంది. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.619 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 ఎగువ స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.680 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.585 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అంబూజా సిమెంట్‌: ఆరు నెలలుగా ఈ షేరు అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. హయ్యర్‌ హై.. హయ్యర్‌ లో ఫామ్‌ చేస్తోంది. ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ఉంది. గత శుక్రవారం రూ.607 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.570/580 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.640/680 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.550 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టీవీఎస్‌ మోటార్స్‌: మంచి అప్‌ట్రెండ్‌ తర్వాత ఈ షేరు కన్సాలిడేట్‌ అవుతోంది. అనిశ్చితి తొలగిపోయింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ బాగుంది. గత శుక్రవారం రూ.2,858 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,825 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.2,950 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.2,800 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 02:17 AM