Stock Market Closing: శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:30 PM
వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీని చవిచూశాయి. ఉదయం గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్లు తన దూకుడును కొనసాగించాయి. నిఫ్టీ 50 స్టాక్ లలో 47 స్టాక్స్ లాభాల్లో ముగియడం విశేషం.

Friday Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతాన్ని(శుక్రవారం) భారీ లాభాలతో ముగించాయి. ఈ ఉదయం గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్లు మార్నింగ్ సెషన్ అంతా లాభాల బాటలోనే పయనించాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొంతమేర తగ్గినప్పటికీ మళ్లీ పుంజుకుని భారీ లాభాలతో మార్కెట్లు ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా చాలా దేశాలపై వాణిజ్య సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించిన తరువాత మిశ్రమ ఆసియా ధోరణుల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీని చవి చూడటం విశేషం.
ఇక, బీఎస్ఈ(BSE) సెన్సెక్స్(Sensex) 1310.11 పాయింట్లు (1.77 శాతం) లాభపడి 75,157.26 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ(NSE) నిఫ్టీ(Nifty) 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం పెరిగి 22,828.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో 47 షేర్లు లాభాల్లో ముగియటం నేటి ట్రేడింగ్ లో విశేషం. టాటా స్టీల్ 4.84 శాతం, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.81 శాతం, కోల్ ఇండియా 4.51 శాతం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.43 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా ఇవాళ నిలిచాయి. ఇక, బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.84 శాతం, స్మాల్ క్యాప్ 3.04 శాతం పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..
NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు
Read Latest Telangana News And Telugu News